Oct 19 2021 @ 00:57AM

టీఎఫ్‌సీసీకి నవంబర్‌ 14న ఎన్నికలు

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ)కి నవంబర్‌ 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని టీఎఫ్‌సీసీ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తెలిపారు.  మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం 30 మందితో  కూడిన టీఎఫ్‌సీసీ పాలక కమిటీ గడువు త్వరలో ముగియనుంది.  8 వేలమంది సినీ కార్మికులతో, 800 మంది నిర్మాతలతో, నాలుగు వందల మంది టీ మా ఆర్టిస్టులతో టీఎఫ్‌సీసీ అభివృద్ది పథంలో ముందుకు నడుస్తోందని ఆర్‌.కె.గౌడ్‌ చెప్పారు. పలువురు ఆర్టిస్టులకు రూ. ఐదు లక్షల హెల్త్‌ కార్డులు అంద జేసినట్టు ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున త్వరలో సినిమా అవార్డుల ఫంక్షన్లను నిర్వహించనున్నట్టు ఆయన  ప్రకటించారు.