కరోనా వాక్సిన్‌ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలి: బొప్పరాజు

ABN , First Publish Date - 2021-01-21T20:53:48+05:30 IST

ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు కోరారు. ఉద్యోగుల తరపున ప్రభుత్వం

కరోనా వాక్సిన్‌ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలి: బొప్పరాజు

అమరావతి: ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు కోరారు. ఉద్యోగుల తరపున ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని సూచించారు. గవర్నర్‌కు ఉన్న విచక్షణాధికారాలు ఉపయోగించి.. ఎన్నికల ప్రక్రియను ఆపాలన్నారు. కరోనా వాక్సిన్‌ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలని బొప్పరాజు పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే టీకాలు వేయమని కేంద్రం చెప్పిందని, ఎన్నికల విధుల్లోని ఉద్యోగులందరికీ వాక్సిన్ ఇవ్వడం సాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు. లక్షలాది మంది ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వగలరా అని నిలదీశారు. ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఎస్ఈసీ రమేష్‌కుమార్, ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఎస్ఈసీ ఇష్టానుసారం ఉద్యోగులను సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయని బొప్పరాజు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-21T20:53:48+05:30 IST