Abn logo
Sep 22 2021 @ 01:11AM

ఎన్నికలు ప్రకటించి పాదయాత్రకు వెళ్లాలి..

- మాజీ ఎమ్మెల్యే కందికుంట 

కదిరి, సెప్టెంబరు 21: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద మ్ముంటే ఎన్నికలు ప్రకటించి పాదయాత్రకు వెళ్ళాలని మాజీ ఎమ్మెల్యే కంది కుం ట వెంకటప్రసాద్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ప్రతి పక్షనాయకుడి హోదాలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశాడని గుర్తు చేశారు. ఆ స మయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక మాటలు మాట్లాడారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడే ఎన్నికలు ప్రకటిం చి పాదయాత్రకు వెళ్లాలన్నారు. పాదయాత్రకు వెళితే గతంలో మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడును అన్న మాటలతోనే ప్రజలు సమాధానం చెబుతారని పేర్కొన్నారు. 

       స్థానిక ప్రజా ప్రతినిధి తన స్థాయి మరచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతం లో తన ఆసుపత్రికి ఉన్న ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం రద్దు చేస్తే తిరిగి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న ప్రజా ప్రతినిధి కూడా మేనేజ్‌చేయడం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరికి బాధకలిగితే వారు తమకు సరైన న్యాయం జరగనప్పుడు కోర్టుకు వెళ్ళడం సహజమన్నారు. అంత మాత్రాన నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. మీరు చేస్తే సంసారం, అదే ఇతరులు చేస్తే వ్యభిచా రమా అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకరని మా ట్లాడుతున్న ప్రజా ప్రతినిధి, ఇప్పటికిప్పుడే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళితే ఇప్పుడు చెబుతున్న 30 వేలపైచిలుకు ఓట్లతో ఓడిపోవడం ఖాయమన్నారు. గతంలోనే కదిరి తెలుగుదేశం అభ్యర్థి తానేనని ప్రకటించారని, మీకు దమ్ముంటే మీరు వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినని ప్రకటించగలరా అని సవాలు విసిరారు.

     వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. పరిషత్‌ ఎన్నికల్లో ఘనమైన ఫలితాలు సాధించామని భుజాలు కొట్టుకుంటున్న వైసీపీ, పోటీలో ప్రతిపక్ష పార్టీ లేకున్నా 100 శాతం ఫలితాలు సాధించలేక పోయిం దన్నారు. ప్రగల్భాలు మాని అభివృద్ధి వైపు దృష్టి సారించాలని హితవు చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ హిందూపురం జిల్లా ఉపాధ్యక్షులు మోపూరిశెట్టి చం ద్రశేఖర్‌, టీడీపీ నాయకులు రాజశేఖర్‌బాబు, రాజారెడ్డి, డైమండ్‌ ఇర్ఫాన్‌, టెలీకాం భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.