తొందర్లోనే జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు : ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-08-15T21:28:40+05:30 IST

జమ్మూ కశ్మీర్ పునర్విభజన ప్రక్రియ పూర్తైన వెంటనే జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయని

తొందర్లోనే జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ పునర్విభజన ప్రక్రియ పూర్తైన వెంటనే జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు ఉంటారన్న హామీకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. 74వ స్వాంతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు.


‘‘జమ్మూ కశ్మీర్‌లో పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తైన వెంటనే... ఎన్నికలు జరుగుతాయి. జమ్మూ కశ్మీర్ కంటూ ఓ ముఖ్యమంత్రి, మంత్రులుంటారు. ఈ హామీకు మేము కట్టుబడి ఉంటాం’’ అని ఆయన స్పష్టం చేశారు.

జమ్మూ కశ్మీర్ ఈ యేడాదిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, శరణార్థులు కూడా గౌరవంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయమని తెలిపారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు తమ తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియ తొందర్లోనే ప్రారంభమవుతుందని, వారు తమ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిని ఎన్నుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-15T21:28:40+05:30 IST