ఉత్కంఠకు తెర

ABN , First Publish Date - 2021-01-26T06:04:13+05:30 IST

పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఎన్నికల కోలాహలం మొదలైంది.

ఉత్కంఠకు తెర

  1. పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌
  2. డీలా పడ్డ అధికారపార్టీ నాయకులు
  3. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి
  4. అభ్యర్థుల ఎంపికలో టీడీపీ, బీజేపీ నాయకులు
  5. కలెక్టర్‌ ఆదేశాల కోసం అధికారుల ఎదురుచూపు
  6. ఆర్వో, ఏఆర్వోల ఎంపికలో మార్పులు, చేర్పులు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఎన్నికల కోలాహలం మొదలైంది. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల ప్రక్రియ తదితరాలపై రాజకీయ పార్టీలు ఇప్పటికే కార్యాచరణకు దిగాయి. 25వ తేదీన జరగాల్సిన మొదటి దశ ఎన్నికల ప్రక్రియను మార్పులు చేసి కొత్తగా షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. రెండు, మూడు, నాలుగు దశల ఎన్నికల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. జనవరి 29వ తేదీ నుంచి మొదలయ్యే నామినేషన్ల స్వీకరణతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియం మొదలవుతుంది. మరో నాలుగు రోజులు సమయం లేని వేళ జిల్లాలో రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల నియామకం చేపట్టలేదు. సెలవులో ఉన్న కలెక్టర్‌ వీరపాండియన్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరమే ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 


సుప్రీం ఆదేశాలతో..

సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు పరుగులు పెడుతున్నారు. 2020 మార్చిలో పంచాయతీ ఎన్నికల కోసం స్టేజ్‌-1లో 320 మంది ఆర్వోలు, 320 మంది ఏఆర్వోలను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసుకుంది. స్టేజ్‌-2లో ప్రతీ పంచాయతీకి ఒక అధికారి చొప్పున 970 మందిని నియమించుకుంది. తొలుత వారినే ప్రస్తుత ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలని ప్రయత్నించినా తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యేలా నోటిఫికేషన్‌ మారడంతో మార్పులు, చేర్పులు తప్పడంలేదని అధికారులు వివరిస్తున్నారు. అయితే ఎన్నికల అధికారులను నియమించడంపై తుది నిర్ణయం కలెక్టర్‌దే ఉండాలని అనధికార ఆదేశాలున్నట్లుగా సమాచారం. 


ఏకగ్రీవాలు రద్దు కావాల్సిందే

ప్రజాస్వామ్యాన్ని కించపరచాలనుకున్న వారికి సుప్రీం తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. మొదట్లోనే అంగీకరించి ఉంటే ప్రభుత్వానికి పరువైనా మిగిలుండేది. అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకున్న స్థానాల్లో మళ్లీ అభ్యర్థులను నిలబెడతాం. ఏకగ్రీవంగా గెలిచామని చెప్పుకున్న వారెవరికీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు. ఆ స్థానాల్లో పోటీ జరక్కపోతే ఊరుకునేదిలేదు. కచ్చితంగా అక్కడ ఎన్నికలు జరగాల్సిందే. 

  కోట్ల సుజాతమ్మ, ఆలూరు నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జి 


ఎన్నికల సంఘానికి సహకరించాలి

ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు సహకరించాలి. గతంలోనే హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ సమన్వయంతో ఎన్నికలను నిర్వహించాలి. 

 కె.ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి 


సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం

పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయం. ఇప్పటికైనా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కమిషన్‌కు సహకరించి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. 

 కె.రామాంజనేయులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు


రాజ్యాంగ విలువలను కాపాడాలి

ప్రభుత్వమైనా.. వ్యవస్థ అయినా భారత రాజ్యాంగ విలువలను కాపాడాలి. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లి అభాసుపాలైంది. పంచాయితీ ఎన్నికల పట్ల సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలి. 

 కపిలేశ్వరయ్య, బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు 


---------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొదటిదశ రెండోదశ మూడోదశ నాలుగోదశ

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------

డివిజన్‌ మండలం డివిజన్‌ మండలం డివిజన్‌ మండలం డివిజన్‌ మండలం

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------

నంద్యాల ఆళ్లగడ్డ నంద్యాల బనగానపల్లె కర్నూలు జూపాడు బంగ్లా ఆదోని, ఆలూరు

నంద్యాల చాగలమర్రి నంద్యాల కోయిలకుంట్ల కర్నూలు కొత్తపల్లి ఆదోని చిప్పగిరి

నంద్యాల దోర్నిపాడు నంద్యాల కొలిమిగుండ్ల కర్నూలు మిడ్తూరు ఆదోని దేవనకొండ

నంద్యాల రుద్రవరం నంద్యాల అవుకు కర్నూలు నందికొట్కూరు ఆదోని హాలహర్వి

నంద్యాల శిరివెళ్ళ నంద్యాల సంజామల కర్నూలు పగిడ్యాల ఆదోని హోలగుంద

నంద్యాల ఉయ్యాలవాడ నంద్యాల గడివేముల కర్నూలు పాములపాడు ఆదోని ఆస్పరి

నంద్యాల గోస్పాడు నంద్యాల పాణ్యం కర్నూలు బేతంచర్ల ఆదోని కోసిగి

నంద్యాల నంద్యాల కర్నూలు ఓర్వకల్లు కర్నూలు డోన్‌ ఆదోని కౌతాళం

నంద్యాల బండి ఆత్మకూరు కర్నూలు సి. బెలగళ్‌ కర్నూలు ప్యాపిలి ఆదోని మంత్రాలయం

నంద్యాల మహానంది కర్నూలు గూడూరు కర్నూలు కృష్ణగిరి ఆదోని పెద్దకడుబూరు

కర్నూలు ఆత్మకూరు కర్నూలు కోడుమూరు కర్నూలు వెల్దుర్తి ఆదోని ఆదోని

్లకర్నూలు వెలుగోడు కర్నూలు కర్నూలు ఆదోని మద్దికెర ఆదోని గోనెగండ్ల

కర్నూలు కల్లూరు ఆదోని పత్తికొండ -- ఆదోని నందవరం

-- -- ఆదోని తుగ్గలి ఆదోని ఎమ్మిగనూరు


Updated Date - 2021-01-26T06:04:13+05:30 IST