ఎన్నికల హడావుడి మొదలైందోచ్‌..!

ABN , First Publish Date - 2021-01-24T06:09:06+05:30 IST

మండలంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. శనివారం నోటిఫికేషన్‌ విడుదల కావడంతో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో హడావుడి మొదలైంది.

ఎన్నికల హడావుడి మొదలైందోచ్‌..!
ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తున్న అధికారులు

సామగ్రిని సిద్ధం చేస్తున్న అధికారులు

బ్యాలెట్‌ పత్రాల పరిశీలనలో తలమునకలు


తుమ్మపాల, జనవరి 23: మండలంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. శనివారం నోటిఫికేషన్‌ విడుదల కావడంతో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో హడావుడి మొదలైంది. ఎన్నికల ఏర్పాట్ల పనిలో అధికారులు తలమునకలు కావడం కనిపించింది. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ పత్రాలు, బాక్సులు, ఇతరత్రా మెటీరియల్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విషయాలు మాట్లాడేందుకు వారు ఇష్టపడలేదు. 

Updated Date - 2021-01-24T06:09:06+05:30 IST