హామీల వర్షం

ABN , First Publish Date - 2021-03-04T05:30:00+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

హామీల వర్షం

నరసాపురం జిల్లా కేంద్రం చేస్తామంటున్న వైసీపీ

మున్సిపల్‌ పన్ను, షాపుల అద్దె తగ్గిస్తామంటున్న టీడీపీ


నరసాపురం, మార్చి 4 : మున్సిపల్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త హామీ లతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నందున తమకు పట్టం కడితే నరసాపురాన్ని జిల్లా కేంద్రం గా ఏర్పాటు ప్రయత్నిస్తామని హామీ గుప్పిస్తున్నారు. దీంతో పాటు వశిష్ఠ వారధి, వార్డుల్లో మంచినీటి సమస్య, డంపింగ్‌ యార్డ్‌ సమస్యల పరిష్కరి స్తామంటూ పట్టణ ప్రజలకు హామీలు గుప్పిస్తుస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కొత్త ఒరవడితో ఓటర్ల ముందుకు వెళుతోంది. మున్సి పాలిటీలో తమకు పూర్తిస్థాయి మెజార్టీ ఇస్తే వ్యాపారులు, మున్సిపల్‌ దు కాణాల్లో వర్తకులకు పన్ను, అద్దె తగ్గిస్తూ మొదటి తీర్మానం చేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో పాటు పట్టణంలో డ్రెయిన్‌, తాగునీటి సమస్య డంపింగ్‌ యార్డ్‌ సమస్య పరిష్కరిస్తామని, నీతివంతమైన పాలన అంది స్తామని చెబుతున్నారు. నామినేషన్లు ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులు హమీలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. పోలింగ్‌ సమీపిస్తుం డడంతో మరింతగా హామీల వర్షం కురుస్తుందని ఓటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2021-03-04T05:30:00+05:30 IST