‘ఎన్నికల నిర్వహణలో మార్పు రావాలి’

ABN , First Publish Date - 2021-07-25T04:52:07+05:30 IST

ఎన్నికల నిర్వహణ విధానంలో విప్లవాత్మక మా ర్పులు రావాలని లేదంటే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదముందని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు సంగటి మనోహర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఎన్నికల నిర్వహణలో మార్పు రావాలి’

బద్వేలు,జూలై 24: ఎన్నికల నిర్వహణ విధానంలో విప్లవాత్మక మా ర్పులు రావాలని లేదంటే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదముందని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు సంగటి మనోహర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం డాక్టర్‌ అంబేడ్కర్‌ భవనంలో వివిధ ప్రజాసంఘాల నేతలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ

ప్రతి ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు, మోసాలు, దారుణాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని వాటిని సమూలంగా నిర్మించే దిశగా  ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బద్వేలు ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో ప్రజాసంఘాల ఏకాభిప్రాయం సాధించేదిశగా ప్రయత్నా లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకు లు కుమార్‌, ప్రభుదాస్‌, అమీన్‌పీరా, వెంకటసుబ్బయ్య, మహిళాసంఘం నాయకురాలు షేక్‌హుమేరా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:52:07+05:30 IST