Abn logo
Sep 21 2021 @ 01:11AM

ఎలక్షన్‌ కాదు.. సెలక్షనే : ఉగ్ర

మాట్లాడుతున్న ఉగ్రనరసింహారెడ్డి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉగ్రనరసింహారెడ్డి

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శ

పామూరు, సెప్టెంబరు 20 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను తాము ఫలితాలుగా భావిచలేదని అవి సెలక్షన్‌ లాంటివని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఎద్దేవ చేశారు. మండలంలోని బొట్లగూడూరు గ్రామంలో సోమవారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఉగ్ర అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. మండల పరిషత్‌ ఎన్నికలు బోగస్‌ అని అందుకే టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతూ ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. అన్నిరంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలోని అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తూ అధికార పక్షానికి దాసోహం అయ్యారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిమ్జ్‌, రైల్వే లైన్‌, మోపాడుకు వెలుగొండ జలాలు, జైకో, ట్రిపుల్‌ ఐటి, మంచినీటి కోసం తాము తెచ్చిన పధకాల అమలు కోసం పోరాడతామన్నారు. వైసీపీ అరాచక పాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రజలే పోరాటాలు చేసేందుకు సిద్దమవుతున్నారన్నారు. పాత, కొత్త నాయకులు సమన్వయంగా ఉంటూ గ్రూపు రాజకీయాలను విడనాడి టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

సీఎ్‌సపురం : జగన్‌మోహన్‌ రెడ్డి పాలనకు రాష్ట్ర ప్రజలు విసుగుచెందారని మాజీ ఎమ్మెల్యే కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. స్థానిక రహిమాన్‌ ఫంక్షన్‌ హాలులో సోమవారం టీడీపీ మండలపార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో టీడీపీ గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కష్టపడి పార్టీకోసం పనిచేయకపోతే ప్రతిపక్షంలోనే ఉంటామన్నారు. గ్రామగ్రామాన అధికారపార్టీ ఆగడాలను ఎండగట్టి టీడీపీకి ప్రజలు ఓట్లు వేసేలా చైత న్య పరచాలన్నారు. టీడీపీ కార్యకర్తలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలవాలని సూచించారు. పార్టీ పరంగా కార్యకర్తలకు అన్యాయం జరిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలు మనస్పర్థలు వీడి సమష్టిగా పనిచేయాలన్నారు. 2024లో టీడీపీ అధికారంలోనికి వచ్చేలా కృషిచేయాలన్నారు. సమావేశంలో సీ.ఎ్‌స.పురం సర్పంచ్‌ శ్రీరాం పద్మావతి, ఉపసర్పంచ్‌ పాములపాటి నర్సయ్య, మాజీ ఎంపీపీ తోడేటి అల్లూరయ్య, ఎంపీటీసీ వెంగయ్య, మాజీ సర్పంచ్‌లు ఎన్‌.సీ.మాలకొండయ్య, పునుగుపాటి రవికుమార్‌, నరసరాజు, చావా సుబ్బయ్య, వెంకటసుబ్బయ్య, మాజీ కోఆప్షన్‌ సభ్యులు పఠాన్‌ నాయబా, టీడీపీ నాయకులు రామకృష్ణంరాజు, బొబ్బూరి రమేష్‌, మన్నేపల్లి శ్రీనువాసులు, గోదాసు జయరాములు, బత్తుల రమణయ్య, పోకల రవిచంద్ర, బత్తుల వెంకటాద్రి, ఆర్‌.కే.వలి, దాసరి మల్లిఖార్జున మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.