Abn logo
Mar 4 2021 @ 01:18AM

ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

అమలాపురం టౌన్‌, మార్చి 3: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు,  మున్సి పల్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని అమ లాపురం సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల10న మున్సిపల్‌ ఎన్నికలు, 14న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్‌ పరిధిలోని అధికారులతో బుధవారం సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. డివిజన్‌ పరిఽ దిలోని సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ భవన నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. సచివాలయాల్లో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. గృహనిర్మా ణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఎల్‌పీవో ఆర్‌.విక్టర్‌, డీఎల్‌డీవో వి.శాంతామణి, ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు, జేఈ పీఎస్‌ రాజ్‌కుమార్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement