45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చుల వివరాలివ్వాలి

ABN , First Publish Date - 2021-05-11T09:38:56+05:30 IST

ఇటీవల జరిగిన మునిసిపల్‌ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఆదేశించారు. ఎన్నికల నియామావళి ప్రకారం ఫలితాలు వెల్లడించిన 45 రోజుల వరకు గడువు ఉంటుందన్నారు.

45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చుల వివరాలివ్వాలి

రాష్ట్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన మునిసిపల్‌ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఆదేశించారు. ఎన్నికల నియామావళి ప్రకారం ఫలితాలు వెల్లడించిన 45 రోజుల వరకు గడువు ఉంటుందన్నారు. ఈ ప్రకారం ఏకగ్రీవమైన నాలుగు వార్డులకు సంబంధించి ఫలితాలు ఏప్రిల్‌ 22న వెల్లడించినందున జూన్‌ 8లోగా వివరాలు అందించాలన్నారు. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీల్లోని అన్ని వార్డులు, ఇతర మునిసిపాలిటీల్లోని మరో ఐదు వార్డుల ఫలితాలు మే 3న వెలువరించినందున వీరంతా జూన్‌ 16లోగా ఎన్నికల ఖర్చుల వివరాలను అందించాలని ఆదే శించారు.

Updated Date - 2021-05-11T09:38:56+05:30 IST