Abn logo
Sep 19 2021 @ 09:24AM

గుంటూరులో నిలిచిన ఎన్నికల కౌంటింగ్

గుంటూరు: జిల్లాలోని తాడికొండ మండలానికి సంబంధించిన కౌంటింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ బ్యాక్సులో పేపర్లు తడిచిపోయాయి. దీంతో బేజాత్‌పురం ఎంపీటీసీ, రావెల ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్‌పై సందిగ్ధత నెలకొంది. పేపర్లు తడిచిపోయిన విషయాన్ని సిబ్బంది.. ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి ఆదేశాల మేరకు.. రీపోలింగ్ నిర్వహిస్తారా, లేక కౌంటింగ్ కొనసాగిస్తారా అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా మరి కొన్ని బాక్సుల్లో పేపర్లు చెదలు పట్టినట్లుగా తెలుస్తోంది. చాలా నెలలుగా బ్యాలెట్ బాక్సులను రూముల్లో ఉంచడంతో ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం బాక్సులు తెరిస్తే ఎన్ని దెబ్బతిన్నాయనే విషయం తెలియనుంది. సమాచారం

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...