ఏపీలో ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

ABN , First Publish Date - 2021-01-15T21:43:02+05:30 IST

ఏపీలో ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది.

ఏపీలో ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

అమరావతి: ఏపీలో ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 2,04,71,506, పురుషులు 1,99,66,737 ఉన్నారు. సర్వీసు ఓటర్లు 66,844, థర్డ్ జెండర్ ఓటర్లు 4,135 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 2021 జనవరికి కొత్తగా పెరిగిన 4,25,860 మంది ఓటర్లు పెరిగారని ఎస్‌ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.


అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. ఎన్నికల సంఘం కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. కోర్టు సూచనలు, ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వ అధికారులు కలిసి వెళ్లిన కొద్ది సేపటికే రమేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే నిమ్మగడ్డ నిర్ణయాన్ని, ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు కోర్టుకు కూడా వెళ్లింది. ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టేసింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని న్యాయస్థానం భావించింది. ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని, అందువల్లే ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2021-01-15T21:43:02+05:30 IST