మమతా బెనర్జీ ప్రచారంపై ఈసీ 24 గంటల నిషేధం

ABN , First Publish Date - 2021-04-13T01:48:04+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై..

మమతా బెనర్జీ ప్రచారంపై ఈసీ 24 గంటల నిషేధం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై 24 గంటల పాటు ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఆమె ఇటీవల ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా ఈసీ పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుంది. నిషేధ సమయంలో ఆమె ఏ రూపంలోనూ ప్రచారం చేయకూడదు.


రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లంతా గంపగుత్తగా టీఎంసీకి ఓటు వేయాలని ఇటీవల ఎన్నికల ప్రచార సభలో మమత  పిలుపునిచ్చారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆమె వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళికి విరుద్ధమంటూ ఆ ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఈ అంశంపై మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ రెండు నోటీసులు కూడా ఇచ్చింది. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఈసీకి సమాధానమిచ్చిన మమతా బెనర్జీ.... ప్రధాని మోదీకి ఎందుకు నోటీసులివ్వలేదంటూ ఈసీని ప్రశ్నించారు. కాగా, మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై 24 గంటల  పాటు ఈసీ నిషేధం విధించడంపై టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఈసీ పూర్తిగా రాజీపడే వైఖరి ప్రదర్శించింది' అని ఓ ట్వీట్‌లో ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-04-13T01:48:04+05:30 IST