Jharkhand chief ministerకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసు

ABN , First Publish Date - 2022-05-11T12:58:46+05:30 IST

మైనింగ్ లీజు వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ Jharkhand chief minister హేమంత్ సోరేన్‌కి జారీ చేసిన నోటీసుపై 10రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని...

Jharkhand chief ministerకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసు

10రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశం 

రాంచీ (జార్ఖండ్): మైనింగ్ లీజు వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ Jharkhand chief minister హేమంత్ సోరేన్‌కి జారీ చేసిన నోటీసుపై 10రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తనకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చేసిన పిటిషన్‌ను భారత ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.ఎన్నికల కమిషన్ పంపిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి అతనికి కేవలం 10 రోజుల సమయం ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9ఎ ని ఉల్లంఘించినందుకు,మైనింగ్ లీజుకు తన సీఎం కార్యాలయ అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు సోరెన్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని నోటీసులో ఈసీ కోరింది.


గనుల కేటాయింపుపై బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఫిబ్రవరి 10న జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. గవర్నర్ రమేష్ బైస్ ఈ ఫిర్యాదును మార్చి చివరి వారంలో భారత ఎన్నికల సంఘానికి పంపారు.దీంతో కమిషన్ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసి ప్లాట్లు, గనుల వివరాలను సమర్పించాలని  కోరింది. ఆ తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించాలంటూ సీఎం హేమంత్ సోరెన్‌కు నోటీసులు అందజేసింది. మే 10లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఈసీ కోరింది. నోటీసుకు సమాధానం ఇవ్వడానికి సోరెన్ నాలుగు వారాల గడువును కోరారు.తన తల్లి అనారోగ్యంతో ఉందని, తెలంగాణలోని హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)లోని ఐసీయూలో చేర్చారని సోరెన్ చెప్పారు.


Read more