ఎన్నికలు వాయిదా వేయడం నిమ్మగడ్డ చేసిన తప్పా?: వర్లరామయ్య

ABN , First Publish Date - 2020-05-30T01:14:04+05:30 IST

కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని.. ఎన్నికలు వాయిదా వేయడం నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చేసిన తప్పా? అని టీడీపీ నేత వర్లరామయ్య ప్రశ్నించారు. నిమ్మగడ్డకు కులం అంటగట్టి

ఎన్నికలు వాయిదా వేయడం నిమ్మగడ్డ చేసిన తప్పా?: వర్లరామయ్య

అమరావతి: కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని.. ఎన్నికలు వాయిదా వేయడం నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చేసిన తప్పా? అని టీడీపీ నేత వర్లరామయ్య ప్రశ్నించారు. నిమ్మగడ్డకు కులం అంటగట్టి సీఎం జగన్‌ స్థాయిని తగ్గించుకున్నారని చెప్పారు. రాజ్యాంగ విలువల్ని రక్షించుకోవడానికి ఈ తీర్పు అవసరమన్నారు. హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేదని చెప్పారు. అత్యవసర ప్రజాసంక్షేమ కార్యక్రమం చేపట్టడానికి ఆర్డినెన్స్‌ ఇస్తారని వర్లరామయ్య అన్నారు. అన్ని వ్యవస్థలకు తానే సుప్రీం అని జగన్‌ అనుకుంటున్నాడని, రెండు సార్లు డీజీపీ రోజంతా కోర్టులో నిలబడ్డారని విమర్శించారు. గవర్నర్‌ ఇక నుంచి ఆచితూచి సంతకాలు పెట్టాలన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచన వచ్చిందంటే.. హైకోర్టు నిర్ణయం తప్పని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు అని వర్లరామయ్య హెచ్చరించారు.

Updated Date - 2020-05-30T01:14:04+05:30 IST