EECL : దుమ్మురేపిన ఎలికాన్.. 19% పెరిగిన షేర్లు.. రికార్డ్ గరిష్టానికి స్టాక్

ABN , First Publish Date - 2022-07-25T18:35:19+05:30 IST

బలహీనమైన మార్కెట్‌లో ఎలికాన్ ఇంజనీరింగ్ కంపెనీ (EECL) స్టాక్ బలంగా దూసుకుపోయింది. రెండు రోజులుగా ఈ స్టాక్ ర్యాలీని కొనసాగిస్తోంది.

EECL : దుమ్మురేపిన ఎలికాన్.. 19% పెరిగిన షేర్లు.. రికార్డ్ గరిష్టానికి స్టాక్

EECL : బలహీనమైన మార్కెట్‌లో ఎలికాన్ ఇంజనీరింగ్ కంపెనీ (EECL) స్టాక్(Stock) బలంగా దూసుకుపోయింది. రెండు రోజులుగా ఈ స్టాక్ ర్యాలీని కొనసాగిస్తోంది. ఈ రెండు ట్రేడింగ్ రోజుల్లో స్టాక్ 25 శాతం పెరిగింది. షేర్లు సోమవారం ఇంట్రా-డే(Intra-day)లో బీఎస్ఈ(BSE)లో 19 శాతం పెరిగి రూ.392కి చేరాయి. ఈ స్టాక్ డిసెంబర్ 20, 2007న తాకిన దాని మునుపటి గరిష్ట స్థాయి రూ.343ని నేడు అధిగమించింది.


ఏప్రిల్ 9 నుంచి చూస్తే.. ఎలికాన్ కంపెనీ మార్కెట్ ధర రూ.169.50 నుంచి రెట్టింపు కంటే ఎక్కువ లేదా 117 శాతం పెరిగింది. ఇదే కాలంలో ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 2.1 శాతం పెరిగింది. ఈఈసీఎల్ అనేది పెద్ద మొత్తంలో ఉత్పత్తులను కలిగి ఉన్న ఆసియా(Asia)లో అతిపెద్ద పారిశ్రామిక గేర్ తయారీదారులలో ఒకటి. స్టీల్/సిమెంట్/రబ్బర్/షుగర్ మిల్లులు, హై స్పీడ్ టర్బైన్‌లు, డిఫెన్స్ అప్లికేషన్‌లు, ప్లాస్టిక్ ఎక్స్‌ట్రాషన్‌లు మొదలైన వాటి కోసం గేర్‌బాక్స్‌లను తయారు చేస్తుంది.


2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ గేర్ వ్యాపారంలో అదిరిపోయే ఆర్డర్ ఇన్‌ఫ్లోలు, అనుకూలమైన ప్రొడక్ట్ మిక్స్, అంతర్జాతీయ మార్కెట్‌లలో చొచ్చుకుపోవడంపై దృష్టి పెట్టడం వల్ల బలమైన పనితీరును కనబరిచింది. 2023 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈఈసీఎల్ మంచి ఫలితాలను అందుకుంది. ఏకీకృత నికర లాభం వార్షికంగా 54.9 శాతం పెరిగి రూ. 42.30 కోట్లకు చేరింది. మొత్తం నిర్వహణ ఆదాయం గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.294.2 కోట్ల నుంచి 11.4 శాతం వృద్ధితో రూ.327.7 కోట్లకు చేరుకుంది. 

Updated Date - 2022-07-25T18:35:19+05:30 IST