ముసలోడని కూడా చూడకుండా ఈ వృద్ధుడిని కొందరు మహిళలు కలిసి ఇలా స్తంభానికి కట్టేసి మరీ కొట్టడం వెనుక..

ABN , First Publish Date - 2022-06-30T21:28:05+05:30 IST

అరవయ్యేళ్లు పైబడిన ఓ వృద్ధుడిని కొందరు మహిళలు ఓ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు..

ముసలోడని కూడా చూడకుండా ఈ వృద్ధుడిని కొందరు మహిళలు కలిసి ఇలా స్తంభానికి కట్టేసి మరీ కొట్టడం వెనుక..

అరవయ్యేళ్లు పైబడిన ఓ వృద్ధుడిని కొందరు మహిళలు ఓ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు.. అతడి బట్టలు చించేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారు.. స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.. ఆ వృద్ధుడు బాగా మద్యం సేవించి ఓ మహిళను వేధించాడనే కారణంతో స్త్రీలందరూ కలిసి అతడిపై దాడి చేశారు.. బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలో ఉన్న దానాపూర్‌లో ఈ ఘటన జరిగింది.


ఇది కూడా చదవండి..

మార్కెట్‌కు వెళ్లిన తల్లి.. ఇంట్లో తండ్రి నిద్రపోతున్న సమయం చూసి ఆ 16 ఏళ్ల కూతురి నిర్వాకమిది.. ఆ తండ్రి నిద్రలేచి చూస్తే..


దానాపూర్ డయారాలోని ఓ వృద్ధుడిని అతడి ఇంటి ముందే స్తంభానికి తాడుతో కట్టేశారు. ఆ తర్వాత అతడి బట్టలు చించేసి బాగా కొట్టారు. అతడిని కొట్టిన వారిలో అందరూ మహిళలే ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ వృద్ధుడు తమపై వేధింపులకు పాల్పడ్డాడని మహిళలు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో మహిళలు అతడిని కర్రలతో కొట్టడం కనిపిస్తోంది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.  పోలీసు బృందం గంగారా గ్రామానికి వెళ్లి విచారించింది. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-06-30T21:28:05+05:30 IST