62 ఏళ్ల వయసులో పెళ్లి సిద్ధమైన వృద్ధుడికి భారీ షాక్.. ఏకంగా రూ.60 లక్షల నష్టం.. ఎలా పోగొట్టుకున్నాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-13T20:38:10+05:30 IST

అతను రైల్వేలో ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేశాడు.. ఒంటరితనాన్ని భరించలేక 62 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు..

62 ఏళ్ల వయసులో పెళ్లి సిద్ధమైన వృద్ధుడికి భారీ షాక్.. ఏకంగా రూ.60 లక్షల నష్టం.. ఎలా పోగొట్టుకున్నాడో తెలిస్తే..

అతను రైల్వేలో ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేశాడు.. ఒంటరితనాన్ని భరించలేక 62 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.. ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన మహిళ అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.. అయితే ఆమె అతడికి అబద్ధాలు చెప్పి దఫదఫాలుగా మొత్తం రూ.60 లక్షలు లాగేసింది.. చివరకు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసింది.. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 


ఇది కూడా చదవండి..

నేను గర్భవతిని అయ్యానంటూ ఫోన్ చేసి చెప్పిన ప్రేయసి.. అతడు ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఆమె నిర్ణయమిదీ..!


మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన అనూప్ శర్మ (62) నార్త్ వెస్ట్రన్ రైల్వేలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. 62 ఏళ్ల వయసులో అతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతనికి షాదీ.కామ్ ద్వారా అను సింగ్ (40) అనే మహిళ పరిచయమైంది. అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. అయితే పెళ్లి కంటే ముందు తన ఇంటి సమస్య తీర్చాలని చెప్పింది. అర్జున్ నగర్ ప్రాంతంలో తనకు, తన సోదరుడికి కలిపి ఓ ఇల్లు ఉందని, దానిని రిపేర్ చేయించాలని, ఆ తర్వాత అమ్మేసి డబ్బులు పంచుకోవాలనుకుంటున్నామని చెప్పింది. ఆ ఇంటి మరమ్మత్తుల కోసం కొంత డబ్బు కావాలని అడిగింది. పెళ్లయ్యాక ఇంటిని అమ్మేసి డబ్బుతో వస్తానని చెప్పింది. 


ఆమెను నమ్మిన అనూప్ కొంత డబ్బు ఆమె అకౌంట్లో జమ చేశాడు. ఆ తర్వాత రకరకాల సాకులు చెబుతూ జనవరి 2022 నుంచి మార్చి 2022 మధ్య అనూప్ నుంచి ఆమె మొత్తం 60 లక్షల 82 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఆస్తి అమ్మి రుణం చెల్లిస్తానని మహిళ హామీ ఇచ్చింది. చివరకు మే నెలాఖరున అను తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 


Updated Date - 2022-06-13T20:38:10+05:30 IST