Abn logo
Sep 18 2021 @ 00:43AM

వృద్ధుడి ఆత్మహత్య

కొత్తచెరువు, సెప్టెంబరు 17: మండల పరిధిలోని కేశాపురం గ్రామంలో గాండ్ల శ్రీనివాసులు (75) విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు...మండల పరి ధిలోని కేశాపురం గ్రామంలో గాండ్లశ్రీనివాసులు ఆరోగ్య సమస్యలతో తరచూ బాధపడుతుండేవాడు.  ఈ నేపధ్యంలో జీవితంపై విరక్తిచెందిన ఇంటిలో ఎవరూ లేని సమయంలో విషగుళికలు మింగి అపరస్మారకస్థితిలో పడిపోయాడు.  కుటుంబసభ్యులు ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెం దాడని నిర్ధారించారు. మృతునికి భార్య నారాణమ్మ,  ఇద్దరు కుమారులు రామ్మోహన్‌, రామక్రిష్ణలు ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.