నేరుగా DGP ఆఫీసుకు వచ్చిన వృద్ధజంట.. విషయం ఏంటని అడిగితే.. ఆ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి చెప్పింది విని నివ్వెరపోయిన అధికారులు.. చివరకు..

ABN , First Publish Date - 2022-06-16T22:34:29+05:30 IST

అతను రైల్వేలో పని చేసి 2002లో రిటైర్ అయ్యారు.. ఆ తర్వాత కొడుక్కి వివాహం చేశారు..

నేరుగా DGP ఆఫీసుకు వచ్చిన వృద్ధజంట.. విషయం ఏంటని అడిగితే.. ఆ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి చెప్పింది విని నివ్వెరపోయిన అధికారులు.. చివరకు..

అతను రైల్వేలో పని చేసి 2002లో రిటైర్ అయ్యారు.. ఆ తర్వాత కొడుక్కి వివాహం చేశారు.. అప్పట్నుంచి అతనికి కష్టాలు మొదలయ్యాయి.. అతడిని, అతడి భార్యను కోడలు వేధించడం ప్రారంభించింది.. రోజూ తిట్టేది.. వారి మందులు కూడా లాక్కునేది.. కోడలు కదా అని వారు భరించారు.. అయితే ఆ తర్వాత కొడుకు, కోడలు విడిపోయారు.. అయినా ఆమె వారిని వేధించడం మానలేదు.. దీంతో అతను స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఎస్సై వారి నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు..  దీంతో ఆ వృద్ధ జంట నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశారు.


ఇది కూడా చదవండి..

7 నెలల గర్భవతి అయిన కోడలిని బైక్‌పై ఎక్కించుకుని డాక్టర్‌కు చూపించుకుని వస్తున్న మామ.. క్షణాల్లోనే ఊహించని ఘోరం..!


రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ఓంకార్ సింగ్  రైల్వేలో పనిచేసి 2002లో పదవీ విరమణ చేశారు. అతని భార్య జ్ఞాన్ కౌర్ గృహిణి. అతను తన కుమారుడు దల్బీర్ సింగ్‌కు 2015లో ఉర్మీత్‌ అనే మహిళతో వివాహం చేశాడు. పెళ్లయినప్పటి నుంచి కోడలు వారిని రకరకాలుగా వేధించేది. వారి బీపీ, షుగర్ మందులు కూడా లాక్కునేది. చివరకు భర్తతో కూడా గొడవపడి 2021లో విడిపోయింది. అయినా మాజీ అత్తమామాలను ఉర్మిత్ వదలలేదు. భరణంగా తనకు ఇల్లు రాయాలని ఒత్తిడి చేస్తోంది. కొందరు వ్యక్తులను పంపించి బెదిరింపులకు దిగుతోంది.


దీంతో ఓంకార్ సింగ్ స్థానిక ఏఎస్సైకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఏఎస్సై ఓంకార్ రూ.20 వేలు లంచంగా కావాలని డిమాండ్ చేశాడు. నివ్వెరపోయిన ఓంకార్ నేరుగా డీజీపీని కలిశారు. వారి నుంచి మొత్తం విషయం తెలుసుకున్న డీజీపీ మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించారు.  

Updated Date - 2022-06-16T22:34:29+05:30 IST