అక్కదేవతల ఎలవగంప ఊరేగింపు

ABN , First Publish Date - 2022-08-06T05:06:55+05:30 IST

మండలంలోని తంగేడుకుంట పంచాయతీ నల్లచెరువు పల్లి సమీపంలో వెలసిన అక్కదేవత ఆలయానికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఎలవగంపను ఊరేగింపుగా తీసుకొచ్చారు.

అక్కదేవతల ఎలవగంప ఊరేగింపు
ఉరుముల వాయిద్యాల నడుమ ఎలవగంప తీసుకెళ్తున్న దృశ్యం


ఓబుళదేవరచెరువు, ఆగస్టు 5: మండలంలోని తంగేడుకుంట పంచాయతీ నల్లచెరువు పల్లి సమీపంలో వెలసిన అక్కదేవత ఆలయానికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఎలవగంపను ఊరేగింపుగా తీసుకొచ్చారు.  పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతియేడు మాదిరి గానే గ్రామస్థుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 


Updated Date - 2022-08-06T05:06:55+05:30 IST