Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒకే ఒక్క ప్రశ్న.. ఈ 24 ఏళ్ల కుర్రాడిని IAS ను చేసింది.. ఇతడి కథేంటో తెలిస్తే...

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా, ఘుమర్విన్ ప్రాంతానికి చెందిన ఇషాంత్ జస్వాల్... 24 ఏళ్ల వయసుకే తొలి ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో 80 ర్యాంకు సాధించాడు. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ ఇషాంత్‌కు ఇంకా ఏదో సాధించాలని అనిపించేది. అనుకున్నదే తడవు యూపీఎస్సీ పరీక్షకు హాజరై, తొలి ప్రయత్నంలోనే 80వ ర్యాంకు దక్కించుకున్నాడు. అతను మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అతనితో పాటు పనిచేస్తున్న సిబ్బంది, బంధువులు అతనిని 15 ఏళ్ల తరువాత ఏం చేస్తావు? అని అడిగేవారు. 

ఈ ప్రశ్నకు ఇషాంత్ దగ్గర సమాధానం లేకపోయినప్పటికీ, ఈ ప్రశ్న అతని మదిని తొలిచివేసింది. దీంతో అతనికి ఎన్నో కెరియర్ ఆప్షన్లు కనిపించాయి. వాటిలో సివిల్ సర్వీసెస్‌ను ఎంచుకుని, అందుకు ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు. అంతే తన ఉద్యోగానికి రాజీనామా చేసి, సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. ఇషాంత్ తండ్రి సైన్యంలో సుబేదార్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి గృహిణి. సోదరికి వివాహం అయ్యింది. దీంతో ఇంట్లో తల్లిదండ్రులతో పాటు అతనొక్కడే ఉంటున్నాడు. ఇషాంత్ 2019లో నోయిడాకు వచ్చి, సివిల్స్‌కు కోచింగ్ తీసుకోవడం ప్రారంభించాడు. అయితే 2020లో కరోనా కారణంగా కోచింగ్ మధ్యలోనే వదిలివేసి, ఇంటికి వెళ్లిపోవాల్సివచ్చింది. ఈ సందర్భంగా ఇషాంత్ మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో ఇంటికి వెళ్లిపోయినా సివిల్స్ సర్వీస్‌కు ప్రిపేర్ కావడం ఆపలేదన్నారు. ఇంటిలోనివారి సహకారంతో పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధం కాగలిగానన్నారు. 2018లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఇషాంత్ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement