ఎల‌న్ మ‌స్క్ ఖాతాలో 178 మిలియన్ డాలర్ల భారీ ప్రాజెక్ట్‌…

ABN , First Publish Date - 2021-07-26T03:02:51+05:30 IST

ఇటీవలే అంతరిక్షయానం చేసి వచ్చిన టెస్లా కార్ల సంస్థ అధినేత ఎల‌న్ మ‌స్క్... ఇప్పుడు మరింత దూడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఎల‌న్ మ‌స్క్ ఖాతాలో 178 మిలియన్ డాలర్ల భారీ ప్రాజెక్ట్‌…

న్యూయార్క్ : ఇటీవలే అంతరిక్షయానం చేసి వచ్చిన టెస్లా కార్ల సంస్థ అధినేత  ఎల‌న్ మ‌స్క్... ఇప్పుడు మరింత దూడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు.  ఇప్ప‌టికే ఎల‌న్ మ‌స్క్ కు సంబందించిన అంత‌రిక్ష సంస్థ ‘స్పేస్ ఎక్స్’ నుంచి అంత‌రిక‌క్ష కేంద్రానికి స‌రుకుల ర‌వాణ‌ా, వ్యోమ‌గాముల చేర‌వేత వంటివి జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే... త్వర‌లోనే చంద్రునిపైకి వ్యోమ‌గాముల తీసుకెళ్లే కార్య‌క్ర‌మాన్ని నాసా రూపొందిస్తోంది.  దీనికి ‘ఆర్టిమిస్’ అనే పేరు పెట్టింది నాసా. 


ఇందులో కీల‌క‌మైన కాంట్రాక్ట్‌ను ఎల‌న్ మ‌స్క్ ద‌క్కించుకున్నారు. దీని విలువ 2.9 బిలియ‌న్ డాల‌ర్లు.  కాగా... 2024 లో నాసా ఓ ఉప‌గ్రహాన్ని ప్ర‌యోగించ‌బోతోంది. ఇందుకు సంబందించిన కాంట్రాక్ట్‌ను కూడా ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సొంతం చేసుకుంది.  ఈ కాంట్రాక్ట్ విలువ 178 మిలియ‌న్ డాల‌ర్ల వరకు ఉండవచ్చని  చెబుతున్నారు.  మొత్తానికి స్పేస్ రంగంలో ఎల‌న్ మ‌స్క్ సంస్థ దూసుకుపోతోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. 

Updated Date - 2021-07-26T03:02:51+05:30 IST