వారంలోపు ఈకేవైసీ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-08-06T05:51:50+05:30 IST

పీఎం కిసాన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఈకేవైసీని రైతులతో వారంలోపు పూర్తి చేయించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆదేశించారు.

వారంలోపు ఈకేవైసీ పూర్తి చేయాలి
బ్రాహ్మణపల్లెలో మొక్కను నాటుతున్న కలెక్టర్‌

పంట నష్టం వివరాలను పక్కాగా నమోదు చేయాలి
కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు

కర్నూలు(కలెక్టరేట్‌), ఆగస్టు 5: పీఎం కిసాన్‌కు సంబంధించి  పెండింగ్‌లో ఉన్న ఈకేవైసీని రైతులతో వారంలోపు పూర్తి చేయించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. వ్యవసాయ శాఖ సమీక్షలో భాగంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 40 శాతం ఈకేవైసీని రైతు భరో సా కేంద్రాలకు లక్ష్యాలను నిర్ణయించి వారంలోపు పూర్తి చేయిం చాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తుల కారణంగా నిర్వహించే పంట నష్టం వివరాలను ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పక్కాగా నమోదు చేయా లని సూచించారు. ఎండోమెంట్‌ భూములకు సంబంధించి కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డుల మంజూరుకు అధికారులతో వివరాలు తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. పశుసంవర్థక శాఖకు సంబంధించి జిల్లాలో మిల్చింగ్‌ అనిమల్స్‌ ఎన్ని ఉన్నాయో.. సూక్ష్మ స్థాయిలో వివరాలు సేకరించాలని ఆ శాఖ అధికారి డా.రామ చం ద్రయను ఆదేశించారు. పశువులకు వ్యాక్సిన్‌  షెడ్యూల్‌ ప్రకారం చేయించాలని ఆదేశించారు. జిల్లాలో గొర్రెలు, మేకలు  ప్రస్తుతం 14 లక్షలు ఉన్నాయని, వీటికి అద నంగా ఇంకో 14 లక్షలు పెంచాలని సూచించారు. ఈసమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి ఏపీఎం ఐపీ పీడీ ఉమాదేవి, హార్టికల్చర్‌ అధికారి రామాంజినేయులు పాల్గొన్నారు.

కష్టపడితేనే ఉన్నత స్థాయికి: కష్టపడితేనే ఉన్నత స్థాయికి చేరుకోగ లమని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం నగరంలోని మదర్‌ థెరిస్సా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసెటికల్‌ అండ్‌ రీసెర్చ్‌ కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న జాబ్‌ మేళా కార్యక్రమానికి కలెక్టర్‌ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాబ్‌మేళాలో 17 కంపెనీలు పాల్గొంటున్నాయని, వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తారని తెలిపారు. నగర మేయర్‌ బీవై రామయ్య మాట్లాడుతూ  ఉద్యోగం వచ్చినా రాకపో యినా నిరుత్సాహ పడకుండా తిరిగి సాధించాలని సూచించారు. కార్యక్ర మంలో మదర్‌ థెరిస్సా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పార్మాసెటికల్‌ అండ్‌ రీసెర్చ్‌ కళాశాల డైరెక్టర్‌ సురేష్‌, డిస్ట్రిక్ట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి శ్రీకాంత్‌ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌, జిల్లా ఉపాధి కల్పనాధికారి సోమశివారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ పాల్గొన్నారు.

చెరువులను సుందరీకరించాలి: కలెక్టర్‌

ఓర్వకల్లు: అమృత్‌ సరోవర్‌ కింద అభివృద్ధి చేస్తున్న చెరువులను సుందరీకరించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండ లంలోని బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలో అమృత్‌ సరోవర్‌ కింద అభి వృద్ధి చేస్తున్న చెరువును, అలాగే కాల్వబుగ్గ సమీపాన ఉన్న నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద రూ.7.93 కోట్లతో 88 చెరువులను అభివృద్ధి చేస్తున్నా మని తెలిపారు. అనంతరం కాల్వబుగ్గ వద్ద జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో పెంచుతున్న నర్సరీని పరిశీలించారు. 20 లక్షల మొక్కలను పెంచుతున్నామని డ్వామా పీడీ అమర్నాథ్‌ రెడ్డి వివరించారు. అనంతరం కలెక్టర్‌ మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివప్రసాద్‌ రెడ్డి, ఎంపీడీవో శివనాగప్రసాద్‌, ఏపీడీ లక్ష్మన్న పాల్గొన్నారు.


Updated Date - 2022-08-06T05:51:50+05:30 IST