ఈకేవైసీ గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2022-06-25T04:36:51+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌నిధి పథకం కోసం ఈకేవైసీ గడువును పొడిగించింది.

ఈకేవైసీ గడువు పొడిగింపు
మక్తల్‌ మండలం కర్ని రైతు వేదికలో ఈకేవైసీ అప్‌లోడ్‌ చేస్తున్న ఏఈవో(ఫైల్‌)

- జూలై 31లోగా   ఈకేవైసీ చేయించుకోవాలి 

- పేట జిల్లాలో మొత్తం పీఎం కిసాన్‌  ఖాతాలు 76,120

- ఇప్పటివరకు నమోదు చేసుకున్న వారు  45,216 మంది


నారాయణపేట, జూన్‌ 24: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌నిధి పథకం కోసం ఈకేవైసీ గడువును పొడిగించింది. మొదట్లో ఈనెల 30వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకునేందుకు గడువు ఉండగా తాజాగా ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గడువును పొడిగించింది. అయితే, ఈ పథకం కింద మూడు విడతలుగా ప్రభుత్వం ఒక్కో విడతలో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు పది విడతలుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు వేశారు. అయితే బోగస్‌ పేర్లు ఖాతాల వల్ల ఈ పథకం పక్కదారి పడుతున్నట్లు గుర్తించి అవినీతి అక్రమాలకు చెక్‌పెట్టేందుకు రైతుల బ్యాంకు ఖాతాలకు ఈకేవైసీ నమోదు చేయాలని నిర్ణయిం చింది. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 76,120 మంది పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి లబ్ధిదారులు ఉండగా జూన్‌ 20వ తేదీ నాటికి 45,216 మంది ఈకేవైసీ చేసుకున్నారు. ఇంకా 30,904 మంది రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. అయితే, పీఎం కిసాన్‌సమ్మాన్‌ పథకం కింద 2019 జనవరి 31 కంటే ముందే పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న వారు మాత్రమే పథకానికి అర్హులు. ఈ పథకం కింద డబ్బులు పొందే రైతులు విధిగా తమ బ్యాంకు ఖాతాలను ఈకేవైసీ నమోదు చేసుకుంటేనే పీఎం కిసాన్‌ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. ఈకేవైసీ నమోదు చేసుకోని రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్‌ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు రైతువేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 77 రైతువేదికల్లో కొన్నిచోట్ల ఏఈవోలు రైతులకు ఈకేవైసీ అనుసంధానం చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇదివరకు మే 31వ తేదీ వరకు ఈకేవైసీ చేసుకునేందుకు గడువు ఉండగా కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని జూలై 31వ తేదీ వరకు ఈకేవైసీకి గడువును పొడిగిస్తూ మరో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

 ఈకేవైసీ నమోదు ప్రక్రియ ఇలా..

రైతులు సమీపంలోని మీసేవా కేంద్రాల్లో ఆధార్‌కార్డుకు బ్యాంకు ఖాతాను లింక్‌ చేస్తూ ఫిం గర్‌ ప్రింట్‌తో ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసు కుంటే రైతు ఖాతాల్లో ఏడాదికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.6వేలు మూడు విడతల్లో రూ.2వేల చొప్పున జమ అవుతాయి. కాగా, ఆండ్రా యిడ్‌ ఫోన్‌లో కూడా ఈకేవైసీ చేసుకునే వెసులు బాటు ఉంది. 

 జిల్లాలో ఈకేవైసీ నమోదు ఇలా...

జిల్లాలోని దామరగిద్ద మండలంలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ కింద 7,296 మంది అర్హులుండగా 4,625మంది ఈకేవైసీ నమోదు చేసుకోగా, 2,671 మంది రైతుల ఖాతాలు పెండింగ్‌లో ఉన్నారు. ధన్వాడ మండలంలో 4,669 మంది అర్హులుండగా 2,858 మంది ఈకేవైసీ నమోదు చేసుకోగా, 1,811  మంది రైతుల ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కోస్గి మండలంలో 10,457 మంది ఉండగా,  6,209 మంది రైతులు ఈకేవైసీ నమోదు చేసుకోగా, 4,248 ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కృష్ణ మండలంలో 5,013 మంది అర్హులుండగా 2,404 మంది ఈకేవైసీ నమోదు చేసుకోగా, 2,609 మంది రైతుల ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. మద్దూరు  మండలంలో 6,532 మంది అర్హులుండగా 4,430 మంది ఈకేవైసీ నమోదు చేసుకోగా, 2,102 మంది రైతుల ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. మాగనూరు మండలంలో 5,404 మంది అర్హులుండగా 2,784 మంది ఈకేవైసీ నమోదు చేసుకోగా 2,620 మంది రైతుల ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. మక్తల్‌ మండలంలో 6,900 మంది అర్హులుండగా 4,036 మంది ఈకేవైసీ నమోదు చేసుకోగా 2,864 మంది రైతుల ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరికల్‌  మండలంలో 6,991 మంది అర్హులుండగా 3,655 మంది ఈకేవైసీ నమోదు చేసుకోగా 3,336 మంది రైతుల ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. నారాయణపేట మండలంలో 10,346 మంది అర్హులుండగా 6,387  మంది ఈకే వైసీ నమోదు చేసుకోగా 3,959 మంది రైతుల ఖాతా లు పెండింగ్‌లో ఉన్నాయి. నర్వ మండలంలో 2,612 మంది అర్హులుండగా 1,661 మంది ఈకేవైసీ నమో దు చేసుకోగా 951 మంది రైతుల ఖాతాలు పెండిం గ్‌లో ఉన్నాయి. ఊట్కూరు మండలంలో 9,900 మం ది అర్హులుండగా 6,167 మంది ఈకేవైసీ నమోదు చేసుకోగా 3,733 మంది రైతుల ఖాతాలు పెండింగ్‌ లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 76,120 రైతులు ఉం డగా ఇప్పటివరకు 45,216 మంది ఈకేవైసీ చేసు కోగా ఇంకా 30,904 మంది రైతులు ఈకేవైసీ చేసు కోవాల్సి ఉంది. 

Updated Date - 2022-06-25T04:36:51+05:30 IST