Discussion On OBC Reservations: ఢిల్లీకి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే

ABN , First Publish Date - 2022-07-19T13:37:09+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సోమవారం అర్థరాత్రి ఢిల్లీకి(Delhi) వచ్చారు....

Discussion On OBC Reservations: ఢిల్లీకి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సోమవారం అర్థరాత్రి ఢిల్లీకి(Delhi) వచ్చారు. మహారాష్ట్రలో(Maharashtra) ఓబీసీ రిజర్వేషన్లపై(OBC Reservations) కేంద్రంతో చర్చించేందుకు సీఎం ఏక్‌నాథ్ షిండే సోమవారం అర్థరాత్రి ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌కు చేరుకున్నారు.ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లపై చర్చించేందుకే తాను ఢిల్లీకి వచ్చానని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. ఓబీసీలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పారు.‘‘ఓబీసీలకు న్యాయం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున, దీనిపై చర్చలు జరిపేందుకు నేను ఢిల్లీకి వచ్చాను. రాష్ట్ర దృక్కోణంలో ఇది చాలా ముఖ్యం. మేం న్యాయవాదులతో చర్చలు జరిపాం. ఓబీసీ (OBC) రిజర్వేషన్ కేసు సుప్రీంకోర్టులో (SCలో) విచారణ జరగనుంది.’’ అని సీఎం పేర్కొన్నారు.


శివసేన రెండు వర్గాల పిటిషన్లపై సుప్రీం విచారణ రేపు

జులై 20వతేదీన విచారణ జరగనున్న అనర్హత వేటును సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే క్యాంప్ సుప్రీంకోర్టులో(Supreme Court) వేసిన పిటిషన్‌పై సీఎం షిండే స్పందిస్తూ,తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పారు.మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి శివసేనకు చెందిన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు జులై 20న విచారించనుంది.ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శిబిరం, ఏక్‌నాథ్ షిండే క్యాంపు దాఖలు చేసిన పిటిషన్‌లను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించనుంది.ఏక్‌నాథ్ షిండేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


అనర్హత పిటిషన్లపై విచారణ

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గ్రూపు విప్‌ను శివసేన విప్‌గా గుర్తిస్తూ కొత్తగా నియమితులైన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న చర్యను కూడా వారు సవాలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికీ శివసేన అధికార పార్టీ అధినేతగా ఉన్నందున షిండే నామినేట్ చేసిన విప్‌లను గుర్తించే అధికారం కొత్తగా నియమితుడైన స్పీకర్‌కు లేదని పిటిషన్‌లో పేర్కొంది.అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ థాకరే శిబిరానికి చెందిన సునీల్ ప్రభు పిటిషన్ దాఖలు చేశారు.16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్‌ జారీ చేసిన అనర్హత వేటుతో పాటు శివసేన లెజిస్లేచర్‌ పార్టీ నేతగా అజయ్‌ చౌదరిని నియమించడాన్ని షిండే గ్రూప్‌ సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.


జూన్ 29న, జూన్ 30న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. సభలో తన మెజారిటీ మద్దతును నిరూపించుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఫ్లోర్ టెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రభు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం జూన్ 30న నోటీసు జారీ చేసింది.అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


Updated Date - 2022-07-19T13:37:09+05:30 IST