ఏకవింశతి పత్రం పూజయామి!

ABN , First Publish Date - 2020-08-22T05:33:20+05:30 IST

గరికతో పూజిస్తే సంతృప్తుడై వరాలిచ్చే దైవం గణపతి. వినాయక చవితి పూజలో పత్రికే ప్రాధాన్యం.

ఏకవింశతి పత్రం పూజయామి!

గరికతో పూజిస్తే సంతృప్తుడై వరాలిచ్చే దైవం గణపతి. వినాయక చవితి పూజలో పత్రికే ప్రాధాన్యం. ఏకవింశతి పత్రాలుగా వ్యవహరించే ఆ 21 ఆకులతో గణేశుణ్ణి పూజిస్తారు.
అవన్నీ ఆరోగ్య కారకాలే! ఏకవింశతి పత్ర పూజకు ఉపయోగించే పత్రాలు, 
వాటిలో ఉండే ఓషదీ గుణాల గురించి తెలుసుకుందాం



1. ఓం సుముఖాయనమః 
మాచీపత్రం పూజయామి 
మాచీ పత్రం (మాచి పత్రి)
ఆర్త్‌మీసియా వల్గారిస్‌- మంచి సువాసన గల పత్రి. తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.




2. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి
బృహతీ పత్రం (వాకుడు)
దగ్గు, ఉబ్బసం, నంజు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలను 
అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.




3. ఓం ఉమాపుత్రాయనమః బిల్వపత్రం పూజయామి
బిల్వ పత్రం(మారేడు)
ఈ వృక్షం బహు ప్రయోజనకారి. ఆకు పసరు పలు చర్మ దోషాలను నివారిస్తుంది.



4. ఓం గజాననాయనమః దుర్వాయుగ్మం పూజయామి
దుర్వాయుగ్మం (గరిక)
రక్త పైత్యానికి, మూత్ర  సంబంధిత సమస్యలకు పనిచేస్తుంది.




5. ఓం హరసూనవేనమః దత్తూర పత్రం పూజయామి
దత్తూర పత్రం (ఉమ్మెత్త)
ఆస్తమా, ఇతర దగ్గులకు, కీళ్లవాతములకు మంచి మందు. ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాటులకు విషహరిణిగా పనిచేస్తుంది.




6. ఓం లంబోదరాయనమః బదరీపత్రం పూజయామి
బదరీ పత్రం (రేగు)
అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.




7. ఓం గుహాగ్రజాయనమః అపామార్గ పత్రం పూజయామి
అపామార్గ పత్రం (ఉత్తరేణి)
గాయాలను మాన్చటంలో, 
ఇతర చర్మ సమస్యలకు అద్భుతంగా 
పనిచేస్తుంది.



8. ఓం గజకర్ణాయనమః తులసీపత్రం పూజయామి
తులసీ పత్రం (తులసి)
దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు, 
క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది.




9. ఓం ఏకదంతాయ నమః 
చూతపత్రం పూజయామి
చూత పత్రం (మామిడి ఆకు)
మామిడి భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైంది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.



10. ఓం వికటాయ నమః 
కరవీర పత్రం పూజయామి
కరవీర పత్రం (గన్నేరు)
తలలో చుండ్రును తగ్గిస్తుంది. ఈ మొక్క విషతుల్యం కావున తగిన జాగ్రత్తలు 
తీసుకొని వాడాలి.



11. ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి
విష్ణుక్రాంత పత్రం (విష్ణుకాంత)
దీర్ఘకాలిక దగ్గును, కఫవాతాలను, జ్వరాలను నివారిస్తుంది.




12. ఓం వటవే నమః 
దాడిమీ పత్రం పూజయామి
దాడిమీ పత్రం (దానిమ్మ)
శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను 
హరింపజేస్తుంది. 




13. ఓం సర్వేశ్వరాయ నమః 
దేవదారు పత్రం పూజయామి
దేవదారు పత్రం (దేవదారు)
దేవదారు తైలం చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, పేగుల్లో పుండ్లకు, కండరాల బలోపేతానికి,  లైంగిక ఉత్ర్పేరణకు ఉపయుక్తంగా ఉంటుంది.




14. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి
మరువక పత్రం (మరువం)
నరాల ఉతే్త్ప్రరణకు, చెవిపోటు, 
నొప్పులకు ఔషధంగా ఉపయోగ పడుతుంది.




15. ఓం హేరంభాయ నమః 
సింధువార పత్రం పూజయామి
సింధువార పత్రం (వావిలి)
వాతం, శరీరం, తలమాడు నొప్పిలను తగ్గిస్తుంది. పంటి చిగుళ్లు, కీళ్ల 
బాధలను నివారిస్తుంది.




16. ఓం శూర్పకర్ణాయనమః 
జాజీపత్రం పూజయామి
జాజీ పత్రం (జాజి ఆకు)
ఈ ఆకులు శరీరానికి వేడినిచ్చి శక్తిని కల్పిస్తాయి. వాపు, నొప్పిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.




17.ఓం సురాగ్రజాయ నమః 
గండకీ పత్రం పూజయామి
గండకీ పత్రం (దేవకాంచనం)
కడుపులో నులిపురుగులను హరిస్తుంది.



18. ఓం ఇభవకా్త్రయ నమః 
శమీపత్రం పూజయామి
శమీ పత్రం (జమ్మి ఆకు)
ఈ ఆకురసం మాడుకి చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగనిగలాడేందుకు ఉపకరిస్తుంది. ఈ చెట్టు పైనుంచి వీచే గాలి స్వచ్ఛంగాను, ఆహ్లాదంగాను ఉంచుతుంది.




19. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి
అశ్వత్థ పత్రం (రావి ఆకు)
శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాలను నివారించేందుకు వినియోగిస్తారు.




20. ఓం సుర సేవితాయ నమః 
అర్జున పత్రం పూజయామి
అర్జున పత్రం (తెల్ల మద్ది) 
దీని బెరడు కషాయం గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉండటానికి 
పనిచేస్తుంది. 




21. ఓం కపిలాయ నమః 
అర్కపత్రం పూజయామి
అర్క పత్రం (తెల్ల జిల్లేడు)
తెల్లజిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు 
శరీరాన్ని కాంతివంతం చేస్తాయి.

Updated Date - 2020-08-22T05:33:20+05:30 IST