Abn logo
Mar 8 2021 @ 17:39PM

‘ఏక్ మినీ కథ’ అని పెద్ద ట్విస్టే ఇస్తున్నారుగా..

యువీ క్రియేషన్స్‌ అనుబంధ సంస్థలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'ఏక్‌ మినీ కథ'. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్న సంస్థ యువీ క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ను ఆ సంస్థ నిర్మాతలు స్థాపించిన విషయం తెలిసిందే. ఈ బ్యాన‌ర్లో నిర్మాణం పూర్తి చేసుకున్న 'ఏక్ మినీ కథ' చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల మిక్సింగ్‌తో ఉన్న ఈ టైటిల్‌తో పాటు 'డజ్‌ సైజ్‌ మ్యాటర్‌' అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ చూస్తుంటే.. టైటిల్‌కే ఇది మినీ కథ.. ట్విస్ట్‌ మాత్రం భారీగా ఉంటుందనేలా తెలుస్తుంది. 


'పేపర్ బాయ్' సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సంతోష్‌ శోభన్‌ని ఒక భారీ టేపుతో చుట్టేసినట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు, గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ లక్కరాజు సంగీతం, సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్రయూనిట్ అంటోంది.

Advertisement
Advertisement
Advertisement