May 13 2021 @ 13:36PM

ఓటీటీలోకి 'ఏక్ మినీ కథ'..?

నూతన దర్శకుడు కార్తిక్ రాపోలు తెరకెక్కించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఏక్ మినీ కథ' ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. నిర్మాతలు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకున్నప్పటికి కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారట. అమెజాన్ ప్రైమ్‌ వీడియోస్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. యాంకర్‌ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన 'థ్యాంక్‌ యు బ్రదర్‌' ఓటీటీ ఆహాలో విడుదలైన ప్రేక్షకాధరణ పొందుతోంది. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఓటీటీలోనూ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఏక్ మినీ కథ'కు అమెజాన్ వారు 9 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు ఇది మంచి ఆఫర్ అని సమాచారం. అందుకే నిర్మాతలు కూడా ఒకే అన్నారట. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడలేదు.

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...