UP: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది సజీవదహనం

ABN , First Publish Date - 2022-06-04T23:27:08+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో శనివారంనాడు భారీ పేలుడు సంభవించింది. ధోలానా ప్రాంతంలోని రసాయనిక ఫ్యాక్టరీలో పేలుడు..

UP: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది సజీవదహనం

హపూర్: ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ (Hapur) జిల్లాలో శనివారంనాడు భారీ పేలుడు సంభవించింది. ధోలానా ప్రాంతంలోని రసాయనిక ఫ్యాక్టరీలో (Chemical factory) పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. మరో 15 మంది వరకూ గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.


సీఎం దిగ్భ్రాంతి...సహాయక చర్యలకు ఆదేశం

కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఘటనా స్థలిలో తక్షణ సహాయక చర్యలు చేపట్టి, బాధితులు, వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాగాన్ని సీఎం ఆదేశించారు. కాగా, ఫ్యాక్టరీ బాయిలర్‌లో పేలుడు జరగడంతో ఆరుగురు కార్మికులు మరణించినట్టు రాష్ట్ర మంత్రి నంద్ గోపాల్ గుప్తా ఒక ట్వీట్‌లో తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

Updated Date - 2022-06-04T23:27:08+05:30 IST