Amarnath yatra పర్వత రెస్క్యూ టీమ్‌లో మహిళా సిబ్బంది

ABN , First Publish Date - 2022-06-25T12:58:51+05:30 IST

అమర్‌నాథ్ యాత్రలో (Amarnath yatra) విపత్తుల సమయంలో సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు 8 మంది మహిళా ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని నియమించారు...

Amarnath yatra పర్వత రెస్క్యూ టీమ్‌లో మహిళా సిబ్బంది

శ్రీనగర్ : అమర్‌నాథ్ యాత్రలో (Amarnath yatra) విపత్తుల సమయంలో సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు 8 మంది మహిళా ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని నియమించారు.అమర్‌నాథ్ యాత్రలోని రెండు ట్రెక్ మార్గాల్లో వేర్వేరు ప్రదేశాలలో మోహరించే పర్వత రెస్క్యూ టీమ్‌లలో ఎనిమిది మంది మహిళా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బంది చేరారు.రెండేళ్ల విరామం తర్వాత జూన్ 30వతేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుండడంతో పాదయాత్ర సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.43 రోజుల అమరనాథ్ యాత్ర రెండు మార్గాల నుంచి ప్రారంభం కానుంది. దక్షిణ కశ్మీర్‌లోని నున్వాన్ నుంచి, అనంత్‌నాగ్‌లోని పహల్గామ్ నుంచి గుహ పుణ్యక్షేత్రం వరకు 48 కిలోమీటర్ల ట్రెక్ మార్గంలో మహిళా బృందాలను మోహరించారు. 


సెంట్రల్ కశ్మీర్‌లోని గండర్‌బాల్ జిల్లాలోని బల్తాల్ నుంచి 14-కిమీల చిన్న మార్గం ఉంది.ఎన్డీఆర్ఎఫ్ 8 బృందాలను రెండు మార్గాలలో వేర్వేరు పాయింట్ల వద్ద మోహరించారు. ఈ సిబ్బంది యాత్రికుల భద్రత,సౌకర్యాన్ని నిర్ధారించడానికి పర్వత రెస్క్యూ కార్యకలాపాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు.‘‘యాత్ర మార్గంలో ఆకస్మిక వరదలు, మంచు హిమపాతాలు,కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతిసిద్ధమైన విపత్తులలో సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఇక్కడ మోహరించాం. రెండు మార్గాల్లో మా సిబ్బంది ప్రతికూల పరిస్థితుల్లో భక్తులకు సహాయం చేస్తారు’’ అని ఎన్‌డిఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ఆర్‌కె శర్మ చెప్పారు.


Updated Date - 2022-06-25T12:58:51+05:30 IST