Uttarakhand బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-13T15:41:42+05:30 IST

ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, 8 సార్లు ఎమ్మెల్యే అయిన సీనియర్ బీజేపీ నాయకుడు హర్బన్స్ కపూర్ సోమవారం కన్నుమూశారు...

Uttarakhand బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కన్నుమూత

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, 8 సార్లు ఎమ్మెల్యే అయిన సీనియర్ బీజేపీ నాయకుడు హర్బన్స్ కపూర్ సోమవారం కన్నుమూశారు. ఈయన వయసు 75 ఏళ్లు. హర్బన్స్ కపూర్ గుండెపోటుతో మరణించాడని ప్రాథమిక సమాచారం. కపూర్ మృతి పట్ల ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపంత తెలిపారు. మృదుభాషి అయిన ప్రజల్లో పాపులారిటీ ఉన్న ఎమ్మెల్యే మరణించడం తీరని లోటని సీఎం చెప్పారు. నిత్యం నియోజకవర్గం అభివృద్ధి కోసం కపూర్ పాటుపడ్డాడని సీఎం పేర్కొన్నారు. డెహ్రాడూన్ కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 8 సార్లు విజయం సాధించిన కపూర్ 2007 నుంచి 2012 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభాపతిగా పనిచేశారు. 


Updated Date - 2021-12-13T15:41:42+05:30 IST