ప్రయాగరాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 872 మంది Dengue రోగులు

ABN , First Publish Date - 2021-11-13T13:18:01+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నగరంలో డెంగీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది...

ప్రయాగరాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 872 మంది Dengue రోగులు

ప్రయాగరాజ్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నగరంలో డెంగీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డెంగీ జ్వరాలు ప్రబలి రోగుల ప్లేట్ లెట్లు తగ్గుతుండటంతో ప్రజల్లో కలవరం ఏర్పడింది.శుక్రవారం వరకు 872 మంది రోగులు డెంగీ జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నానక్ శరణ్ చెప్పారు. ప్రయాగరాజ్ నగరంలో 628 డెంగీ కేసులు నమోదైనాయి. 244 డెంగీ కేసులు ప్రయాగరాజ్ గ్రామీణ ప్రాంతాల్లో వెలుగుచూశాయని డాక్టర్ శరణ్ చెప్పారు. డెంగీ రోగులకు బ్లడ్ బ్యాంకు నుంచి ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నామని డాక్టర్ చెప్పారు.డెంగీ జ్వర పీడితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని డాక్టర్ శరణ్ వివరించారు. 

Updated Date - 2021-11-13T13:18:01+05:30 IST