సింక్‌లో న‌క్కిన‌ 8 అడుగుల పాము... ట్యాప్ ఆన్ చేయ‌గానే...

ABN , First Publish Date - 2020-05-28T11:42:05+05:30 IST

బ‌య‌ట ఎక్క‌డైనా పాము క‌నిపిస్తేనే వణికిపోతుంటాం... మ‌రి వంటగ‌దిలోని సింక్‌లో క‌నిపిస్తే ఇంకేమైనా ఉందా? ఇలాంటి ఘ‌ట‌నే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇటార్సీ న‌గ‌రంలోగ‌ల ఒక ఇంటిలో...

సింక్‌లో న‌క్కిన‌ 8 అడుగుల పాము... ట్యాప్ ఆన్ చేయ‌గానే...

హొషంగాబాద్‌: బ‌య‌ట ఎక్క‌డైనా పాము క‌నిపిస్తేనే వణికిపోతుంటాం... మ‌రి వంటగ‌దిలోని సింక్‌లో క‌నిపిస్తే ఇంకేమైనా ఉందా? ఇలాంటి ఘ‌ట‌నే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇటార్సీ న‌గ‌రంలోగ‌ల ఒక ఇంటిలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే వైశాలినగర్‌లో ఉంటున్న‌ మహేష్‌యాదవ్ ఇంటిలో ఎనిమిది అడుగుల పొడ‌వైన‌పాము బయటపడింది. మహేష్ వంటగదిలోని సింక్‌లో చేతులు కడుక్కోవడానికి వెళ్లిన‌ప్పుడు ఈ పామును చూశాడు. వెంట‌నే భ‌యంతో వెనుకకు పరిగెత్తాడు. ఈ విష‌యాన్ని చుట్టుప‌క్క‌ల‌వారికి తెలియ‌జేశాడు. ఆ పామును గ‌దిలో బంధించాడు. పాములు పట్టే అభిజిత్ యాద‌వ్‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పాడు. వెంటనే అభిజిత్ మహేష్ ఇంటికి వ‌చ్చాడు. అరగంట పాటు ప్ర‌య‌త్నించాక అభిజ‌త్ ఆ పెద్ద పామును ప‌ట్టుకోగ‌లిగాడు. అనంత‌రం దానిని బాగ్‌దేవ్ అడవిలోని చెరువులో విడిచిపెట్టాడు. ఈ సంద‌ర్భంగా స్నేక్ క్యాచర్ అభిజిత్ మాట్లాడుతూ తాను ఎర్రతాచు పామును పట్టుకున్నట్లు చెప్పాడు. కాగా వేసవి కాలంలో పాములు చల్లని ప్రదేశాల కోసం చూస్తాయి. ఆ పాము వేడి నుండి తప్పించుకోవడానికి కిచెన్ సింక్‌లోకి ప్రవేశించింద‌ని తెలుస్తోంది. 

Updated Date - 2020-05-28T11:42:05+05:30 IST