బాంబు బెదిరింపుతో ఈఫిల్ టవర్ పరిసరాల్లో హై అలర్ట్

ABN , First Publish Date - 2020-09-24T01:05:10+05:30 IST

ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పారిస్ పోలీసులు హుటాహుటిన అప్రమత్తమయ్యారు. ఈ టవర్‌తోపాటు, దాని పరిసరాలను ఖాళీ

బాంబు బెదిరింపుతో ఈఫిల్ టవర్ పరిసరాల్లో హై అలర్ట్

పారిస్ : ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పారిస్ పోలీసులు హుటాహుటిన అప్రమత్తమయ్యారు. ఈ టవర్‌తోపాటు, దాని పరిసరాలను ఖాళీ చేయించారు. ఈ ప్రాంతానికి అవాంఛనీయ శక్తులు రాకుండా నిరోధించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 


ఈఫిల్ టవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం ఓ ఆగంతకుడు ఫోన్ చేసి, ఈఫిల్ టవర్‌లో బాంబు పెట్టినట్లు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ టవర్లోనూ, దాని పరిసరాల్లోనూ ఉన్న యాత్రికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. 


సియెనే నది నుంచి ట్రోకాడెరో ప్లాజా వరకు ఉన్న వంతెనను, ఈఫిల్ టవర్ క్రిందనున్న వీథులను అష్ట దిగ్బంధనం చేశారు. అయితే తనిఖీల్లో బాంబు ఆచూకీ కనిపించకపోవడంతో, రెండు గంటల తర్వాత  బారికేడ్లను తొలగించారు. 


131 ఏళ్ళనాటి ఈఫిల్ టవర్‌ను సందర్శించేందుకు సాధారణంగా రోజుకు 25 వేల మంది యాత్రికులు వస్తూ ఉంటారు. ప్రయాణాలపై ఆంక్షల కారణంగా ఈ ఏడాది సందర్శకుల సంఖ్య తగ్గింది. 


Updated Date - 2020-09-24T01:05:10+05:30 IST