Abn logo
Mar 7 2021 @ 00:09AM

లక్ష్యం మేరకు ఈజీఎస్‌ పనులు పూర్తి చేయాలి

అధికారులతో కలెక్టర్‌ గుగులోతు రవి వీడియోకాన్ఫరెన్స్‌

జగిత్యాల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈజీఎస్‌ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. శనివారం ప ట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నుంచి మండల స్థా యి ప్రత్యేకాధికారులు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పనుల పురోగతిపై సమీ క్ష నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈజీఎస్‌, లేబ ర్‌, నర్సరీలు, పల్లె ప్రగతి ఇతర పనులపై కేటాయించిన లక్ష్యం సాధించే దిశ గా పనులు జరగాలని సూచించారు. 2019-20, 2020-21 గాను వర్క్‌ పై ల్స్‌, 21 అంశాల రిజిస్టర్లు ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నారు. పూ ర్తి చేసిన పనులకు గాను వివరాలు తెలిపే నేమ్‌ బోర్డులు సక్రమంగా ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. పనులలో ఎటువంటి లోటుపాట్లు లే కుం డా చూసుకోవాలన్నారు. పనులపై ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణా ళిక ప్రకారం పనులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. స కాలంలో పనులు పూర్తి చేయలేకపోవడానికి గల కారణాలను సమీక్షించు కోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో ఒకే రకమైన మొక్కలు కాకుం డా ఉద్యానవన శాఖ సూచించిన విధంగా వివిధ రకాల మొక్కలు నాటా లని తెలిపారు. వన సంరక్షణ పనులు, వాచ్‌ అండ్‌ వార్ట్‌ పనులు సక్రంగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు జాబ్‌ కార్డులను వందశాతం అప్‌లో డ్‌ చేయాలని తెలిపారు. నర్సరీలో మొక్కల సంరక్షణపై దృష్టి సారించాల న్నారు. రోజురోజుకు ఎండలు పెరుగుతున్నందున వేడికి మొలకలు పాడ వకుండా గ్రీన్‌షెడ్స్‌, కాటన్‌ చీరెలతో నీడును ఏర్పాటు చేయాలని తెలి పారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశం, జడ్పీ సీఈఓ శ్రీని వాస్‌, డీఆర్‌డీఓ పీడీ లక్ష్మి నారాయణ, వ్యవసాయ శాఖాధికారి సురేశ్‌, డీసీఓ రామానుజ చారీ, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement