అరచేతిలో గ్రామం!

ABN , First Publish Date - 2022-06-29T06:00:13+05:30 IST

అరచేతిలో గ్రామం!

అరచేతిలో గ్రామం!

పంచాయతీ ప్రగతిని తెలిపే ఈ– గ్రామ్‌ స్వరాజ్‌ యాప్‌.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
ఏలూరు రూరల్‌, జూన్‌ 28: గ్రామ పంచా యతీల అభివృద్ధిని తెలుసుకునేందుకు ఇకపై అధికారులను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఈ– గ్రామ్‌ స్వరాజ్‌యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పంచా యతీలకు విడుదలైన నిధులు, ఖర్చు చేసిన వివ రాలు ఇందులో చూడొచ్చు. పంచాయతీల్లో పాలన పారదర్శకంగా కొనసాగించేందుకు కేంద్రం ఈ నూతన యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులు, ఆర్థిక సంఘాల ద్వారా మం జూరయ్యే నిధుల వివరాలు, అభివృద్ధి పనులు, పాలకవర్గ తీర్మానాలను తెలుసుకోవచ్చు. ఇది అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీల వివరాలు ఈ– గ్రామ్‌ స్వరాజ్‌ యాప్‌లో పొందు పర్చనున్నారు. స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌ ప్లే స్టోర్‌ తెరచి యాప్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ను తెరచి పంచాయతీల వివరాలు ఎంపిక చేసుకోవాలి. తరువాత పంచాయతీల్లో ఆమోదించిన కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, నిధుల మెనూలు కన్పి స్తాయి. వాటి ద్వారా వివరాలను స్మార్ట్‌ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు.


Updated Date - 2022-06-29T06:00:13+05:30 IST