ఈ రైల్వేస్టేషన్‌కు 113 వసంతాలు

ABN , First Publish Date - 2021-06-13T18:05:46+05:30 IST

స్థానిక ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌ ప్రారంభించి 113 వసంతాలు పూర్తికావడంతో అధికారులు, ఉద్యోగులు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలో పెద్ద రైల్వేస్టేషన్లలో ఒ

ఈ రైల్వేస్టేషన్‌కు 113 వసంతాలు


ఐసిఎఫ్‌(చెన్నై): స్థానిక ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌ ప్రారంభించి 113 వసంతాలు పూర్తికావడంతో అధికారులు, ఉద్యోగులు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలో పెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటైన ఈ స్టేషన్‌ 1908 జూన్‌ 11వ తేదీన ప్రారంభించారు. మొగలాయిలు, కోధి కళా నైపుణ్యంతో ఇండో-సరాసని డిజైన్‌తో స్టేషన్‌ భవనాన్ని నిర్మించారు. ఆంగ్లేయులైన రాబర్ట్‌ సిస్‌హోమ్‌ భవన డిజైన్‌ను రూపొందించారు. ఆ కాలంలో ప్రముఖ కాంట్రాక్టర్‌ స్వామినథపిళ్లై ఈ రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. తొలిదశలో రెండు ఫ్లాట్‌ఫాంలతో ప్రారంభమైన ఈ స్టేషన్‌లో ప్రస్తుతం 13 ఫ్లాట్‌ఫారాలున్నాయి. ఈ మార్గంలో 35 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 256 సబర్బన్‌ రైళ్లు జంట మార్గాల్లో నడుస్తున్నాయి. ప్రతిరోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు వచ్చి వెళుతుంటారు. 

Updated Date - 2021-06-13T18:05:46+05:30 IST