కరోనా వేళ.. కోడిగుడ్లకు భారీ డిమాండ్‌

ABN , First Publish Date - 2021-06-15T17:14:39+05:30 IST

కొవిడ్‌ వేళ రోగనిరోధక శక్తినిచ్చే పౌష్టికాహారం తీసుకోవాలని ఇందులో భాగంగా కోడిగుడ్లను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో వీటికి అమాంతం డిమాండ్‌ పెరిగింది. నెలక్రితం వరకు రూ.4

కరోనా వేళ.. కోడిగుడ్లకు భారీ డిమాండ్‌

              - అమాంతం పెరిగిన ధర


బెంగళూరు: కొవిడ్‌ వేళ రోగనిరోధక శక్తినిచ్చే పౌష్టికాహారం తీసుకోవాలని ఇందులో భాగంగా కోడిగుడ్లను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో వీటికి అమాంతం డిమాండ్‌ పెరిగింది. నెలక్రితం వరకు రూ.4.50 పైసలుగా ఉన్న ఒక్కో కోడిగుడ్డు ధర ప్రస్తుతం రూ.6.50 పలుకుతోంది. ఈ ధరల పెరుగుదల తాత్కాలికమేనని రాష్ట్ర పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు డీకే కాంతరాజు మీడియాకు తెలిపారు. కోళ్లకు దాణాగా వేసే సోయా ధర కిలో రూ 40 నుంచి రూ.75 వరకు పెరగడం కూడా కోడిగుడ్ల ధరల పెరుగుదలకు మరోకారణమని ఆయన తెలిపా రు. రాష్ట్రంలోని బెళగావి, మైసూరు, హావేరి, కొప్పళ, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో ప్రతిరోజూ 1.5 కోట్లకు పైగా కోడిగుడ్ల ఉత్పత్తి ఉండగా ఇందులో 50 లక్షల వరకు గుడ్లు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. బెంగళూరులో ప్రతిరోజూ70 లక్షల కోడిగుడ్లు వినియోగం అవుతుండగా రాష్ట్ర మొత్తం మీద 1.30 కోట్ల వరకు గుడ్ల వాడకం జరుగుతోందని ఆయన వివరించారు. హోటళ్లు ప్రారంభమైతే గుడ్ల వినియోగం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-06-15T17:14:39+05:30 IST