ఎగ్ వడ

ABN , First Publish Date - 2020-06-27T21:02:11+05:30 IST

కోడిగుడ్లు - నాలుగు(ఉడికించినవి), కార్న్‌ఫ్లోర్‌ - ఒక కప్పు, సెనగపిండి - రెండు కప్పులు, బియ్యప్పిండి - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, పచ్చిమిర్చి -

ఎగ్ వడ

కావలసినవి: కోడిగుడ్లు - నాలుగు(ఉడికించినవి), కార్న్‌ఫ్లోర్‌ - ఒక కప్పు, సెనగపిండి - రెండు కప్పులు, బియ్యప్పిండి - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా,  వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, పచ్చిమిర్చి - నాలుగైదు, ఉల్లిపాయలు - రెండు, అల్లం  - చిన్నముక్క, తోటకూర - ఒక కట్ట.


తయారీ: ఒకపాత్రలో కోడిగుడ్లను కొట్టి వేయాలి. తరువాత అందులో సెనగపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి. తగినంత ఉప్పు, కారం వేయాలి. కార్న్‌ఫ్లోర్‌ వేసి కలపాలి. తరిగిన పచ్చిమిర్చి, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేయాలి. తోటకూరను చిన్నగా కట్‌ చేసి వేయాలి. అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల మాదిరిగా చేయాలి. పాన్‌పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించితే నోరూరించే ఎగ్‌ వడలు రెడీ.

Updated Date - 2020-06-27T21:02:11+05:30 IST