ఎగ్‌ పరోటా

ABN , First Publish Date - 2020-06-20T18:05:12+05:30 IST

గోధుమపిండి - రెండు కప్పులు, కోడిగుడ్లు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఉ

ఎగ్‌ పరోటా

కావలసినవి: గోధుమపిండి - రెండు కప్పులు, కోడిగుడ్లు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట, గరంమసాలా - అర టీస్పూన్‌.


తయారీ: ఒక పాత్రలో గోధుమపిండి తీసుకొని అందులో ఉప్పు, కొద్దిగా నూనె, ఒక కప్పు నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. నీళ్లు కావాలంటే అదనంగా పోసుకోవచ్చు. తరువాత మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీలా చేయాలి. మూలలు దగ్గరకు మలిచి మళ్లీ చపాతీలా చేయాలి. అలా నాలుగైదు సార్లు రిపీటెడ్‌గా చేయాలి. మరొక పాత్రలో కోడిగుడ్లు వేసి అందులో ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, గరంమసాలా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పరోటాను పెనంపై కొద్దిగా కాల్చాలి. రెండువైపులా కాస్త నూనె పెట్టి కాల్చిన తరువాత ఒకవైపు కత్తితో కట్‌ చేసి పరోటాను తెరవాలి. అందులో కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసి, స్పూన్‌తో నెమ్మదిగా ఒత్తుతూ పరోటాను మూయాలి. ఇప్పుడు కాస్త నూనె అద్దుతూ రెండు వైపులా పరోటాను కాల్చాలి.

Updated Date - 2020-06-20T18:05:12+05:30 IST