Advertisement
Advertisement
Abn logo
Advertisement

తొగటవీర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 5 : తొగటవీరక్షత్రియ ఉద్యోగులు, వృత్తి నిపుణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తొలగవీరక్షత్రియ ఉద్యోగ,  వృత్తి నిపుణుల సే వా సంఘం అధ్యక్షుడు బం డారు రామాంజనేయులు తెలిపారు. ఆదివారం వసంతపేటలో సంఘం కార్యవర్గ సమావేశంలో నియోజకవర్గ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా బండారు రామాంజనేయులు, ఉపాధ్యక్షులుగా ఉమ్మడిశెట్టి నందగోపాల్‌,  పాలెం రాజగోపాల్‌, కంభం పాములేటి, ప్రధాన కార్యదర్శి గంగారపు రాధాకృష్ణమూర్తి, గౌరవాధ్యక్షుడు ఈడెం లక్ష్మీనారాయణ, న్యాయ సలహాదారుడు బడిగించల శ్రీశ్రీధర్‌బాబు, ఆర్థిక కార్యక కార్యదర్శి రబ్బా లక్ష్మీనరసయ్య, సహాయ కార్యదర్శులు సానా రఘురామయ్య, పల్లా శివనాగయ్య, సలహాదారులు పెద్ద వెంకటరంగయ్య, కుండా లక్ష్మీనారాయణ, సభ్యులను ఎన్నుకున్నారు.


Advertisement
Advertisement