Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి

పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణి

సూర్యాపేట కల్చరల్‌, నవంబరు 30: బ్రాహ్మణుల సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణి అన్నారు. సూర్యా పేటలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో సర్వ బ్రాహ్మణ సంఘాలు,   విప్రహిత ఆధ్యాత్మిక  సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బ్రాహ్మణు లందరూ విశాల హృదయంతో కలిసికట్టుగా ఒకే తాటిపై ఉండాలన్నారు. పీవీ వెంట మంది మార్బలం లేదని, కేవలం విద్య, వేదాంతం, మేధా శక్తితో ప్రజల మన్ననలు పొంది ప్రధానిగా పనిచేశారన్నారు.  బ్రాహ్మణ విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో ఉన్నతంగా రాణించా లన్నారు. సూర్యాపేటలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయ డానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ హరిచంద్ర,  బ్రాహ్మణ పరిషత్‌ రాష్ట్ర చైర్మన్‌ చకిలం అనిల్‌కుమార్‌, బండారు రాంప్రసాద్‌, మంత్రమూర్తి శంకరమూర్తి, నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచారి, సుబ్రమణ్యశాస్త్రి, యల్లంబట్ల రమేష్‌, విజయలక్ష్మి, డాక్టర్‌ ఆదుర్తి రామయ్య, వాసుదేవశర్మ, సీతారాం, కేసరి, సీతారామారావు, రోజా, రుక్మారావు పాల్గొన్నారు.


Advertisement
Advertisement