గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-04-17T05:15:49+05:30 IST

గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా కృషి చేస్తానని ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మింపూర్‌ గ్రామ పంచాయతీలో ఆయన పర్యటించారు.

గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

తలమడుగు, ఏప్రిల్‌16: గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా కృషి చేస్తానని ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మింపూర్‌ గ్రామ పంచాయతీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ లక్ష్మింపూర్‌ గ్రామంలో తాగునీటి సమస్య, వివిధ సమస్యలు ఉన్నాయని గిరిజనులు, మండల ప్రజా ప్రతినిధులు తన దృష్టికి తీసుకు రావడంతో గ్రామాన్ని సందర్శించడం జరిగిందన్నారు. లక్ష్మింపూర్‌ గ్రామంలో  బావిని తవ్వుకునేందుకు నిధులు మంజూరు చేస్తున్నానన్నారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు రాని సమయంలో బావినీటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. అంతేకాకుండా గిరిజన విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అంతేకాకుండా ఐటీడీఏ ద్వారా అందించే సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన గిరిజనులు సద్వినియోగ పర్చుకోవాలని కోరారు. కాగా, గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య, లింకు రోడ్ల సమస్య ఉందని వాటిని పరిష్కరించాలని జడ్పీటీసీ గోకగణేష్‌రెడ్డి పీవో దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ఎంపీపీ కళ్యాణం లక్ష్మి, ఉపాధ్యక్షురాలు పెందూర్‌దివ్య, తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, ఎంపీడీవో రమాకాంత్‌, ఎంపీఈవో దిలీప్‌కుమార్‌, సర్పంచ్‌ రాధ మనోహార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:15:49+05:30 IST