ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-07-27T04:08:28+05:30 IST

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
బైరాన్‌పల్లిలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి

మద్దూరు/నంగునూరు, జూలై 26 : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. సోమవారం మద్దూరు, దూళిమిట్ట మండలాల్లోని పలు పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా దూళిమిట్ట మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పీఆర్టీయూ ముందు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, శశిధరశర్మ, ఎంఈవో మొగుళ్ల నర్సింహారెడ్డి, మద్దూరు, దూళిమిట్ట మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరుణాకర్‌, షఫీ, నరేష్‌, శ్రీనివా్‌సరెడ్డి, నాగేందర్‌, చంద్రశేఖర్‌, గణేష్‌, కరుణాకర్‌, శ్రీహరి పాల్గొన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల సాధనలో పీఆర్టీయూ కీలకపాత్ర పోషించిందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. సోమవారం నంగునూరులో జరిగిన పీఆర్టీయూ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కొత్తపల్లి రవి, ప్రధాన కార్యదర్శి ఎర్ర పార్థసారధి, ఉపాధ్యాయ సంఘం నాయకులు రాజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నరేష్‌, రామస్వామి, సత్యనారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-07-27T04:08:28+05:30 IST