క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి : ఎంపీ

ABN , First Publish Date - 2021-01-27T05:20:00+05:30 IST

జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ సోయం బాపురావ్‌ పేర్కొన్నారు. మంగళవారం బోథ్‌లో క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన అనం తరం మాట్లాడారు. జిల్లాలో క్రీడలను అభివృద్ధి పరిచేందుకు గాను అవసర మున్న చోట స్టేడియంల నిర్మాణానికి ప్రతిపాదనలు కేంద్ర క్రీడల శాఖ మంత్రికి విన్నవించామన్నారు.

క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి : ఎంపీ

బోథ్‌, జనవరి 26: జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ సోయం బాపురావ్‌ పేర్కొన్నారు. మంగళవారం బోథ్‌లో క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన అనం తరం మాట్లాడారు. జిల్లాలో క్రీడలను అభివృద్ధి పరిచేందుకు గాను అవసర మున్న చోట స్టేడియంల నిర్మాణానికి ప్రతిపాదనలు కేంద్ర క్రీడల శాఖ మంత్రికి విన్నవించామన్నారు. కొవిడ్‌ వల్ల నిధులు మంజూరికి ఆలస్యం జరిగిందని, త్వరలోనే బోథ్‌లో స్టేడియం  మంజూరికి కృషి చేస్తామన్నారు. ఇందులో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజుయాదవ్‌, గిరిజన మోర్చా జిల్లా నాయకులు జాదవ్‌గోపాల్‌, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు బారె బోజన్న, సహకార సంఘం డైరెక్టర్‌ లోలపు పోశెట్టి, తదతరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన పొచ్చెర వాసులు

బోథ్‌ రూరల్‌: పొచ్చెర గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ది పరుస్తానని ఎంపీ సోయం బాపూరావ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని పొచ్చెర గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ అభివృద్ధికి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానని భరోసాని ఇచ్చారు. అనంతరం ఎంపీ సమక్షంలో 40మంది స్థానికులు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన ఎంపీ సోయం పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - 2021-01-27T05:20:00+05:30 IST