Abn logo
Oct 19 2021 @ 00:32AM

కేసుల పరిష్కారానికి కృషి : జడ్జి

జడ్జిని సన్మానిస్తున్న బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

కోదాడటౌన్‌, అక్టోబరు 18 : కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌ శ్యాంసుందర్‌ అన్నారు. మణుగూరు కోర్టు నుంచి కోదాడకు బదిలీపై వచ్చిన ఆయనకు, కోదాడ బార్‌ అసోసియేషన్‌ నాయకులు సోమవారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయమూర్తులకు కేసు వివరాలు, సవివరంగా అందిస్తే మంచి తీర్పులు వస్తాయన్నారు. ఆ దిశగా న్యాయవాదులు పనిచేయాలని సూచించారు. అనంతరం జడ్జిని బార్‌ అసోసియేషన్‌ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో దేవబత్తిన నాగార్జున, రాజన్న,శ్రీనివాసనాయుడు, సుధాకర్‌రెడ్డి, రాధాకృష్ణ, లక్ష్మీనారాయణరెడ్డి, హనుమంతరావు, వెంకట్రావు, విజయకుమార్‌, శాస్త్రీ, నాగేశ్వరరరావు పాల్గొన్నారు.