కృష్ణాపురం జలాశయ స్థాయి పెంపునకు కృషి

ABN , First Publish Date - 2020-08-02T10:41:30+05:30 IST

కృష్ణాపురం జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో శనివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాజెక్టు వద్ద ప్రత్యేక ..

కృష్ణాపురం జలాశయ స్థాయి పెంపునకు కృషి

డిప్యూటీ సీఎం నారాయణస్వామి 

ప్రాజెక్టు నుంచి రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల 


కార్వేటినగరం, ఆగస్టు 1: కృష్ణాపురం జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో  శనివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి కుశస్థలీ నదిలోకి నీళ్లు వదిలారు. అనంతరం ఇరిగేషన్‌ అధికారి ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ శివారెడ్డి గేట్లు స్విచ్‌ ఆన్‌ చేసి మూడు గేట్లకు గాను రెండు గేట్లు సగం మేర ఎత్తి నీళ్లు కుశస్థలీ నదికి వదిలారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచి వెడల్పు చేస్తే నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవచ్చని, అందుకు కృషి చేస్తానన్నారు. 


కాలువల ద్వారా డ్యాంకు సంబంధించిన 16 చెరువుల్లో నీళ్లు నింపాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్‌ ఈఈ శివారెడ్డి, డీఈ మురళీకృష్ణ, జేఈ నాయక్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌, ఎంపీడీవో చిన్నరెడ్డెప్ప, తహసీల్దార్‌ అమరేంద్రబాబు, మండల వైసీపీ కన్వీనర్‌ ధనంజయవర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీనాయుడు, రాష్ట్ర వైసీపీ యువత కార్యదర్శి ధనంజయరెడ్డి, ఎస్‌ఆర్‌పురం ఏఎంసీ చైర్మన్‌ కృష్ణయాదవ్‌, మాజీ డ్యాం చైర్మన్‌ ఇ.వి.చంద్రశేఖర్‌రాజు, వైసీపీ నాయకులు చిరంజీవిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, ఎంపీడీవో చిన్నరెడ్డెప్ప, సీఐ సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. 


తేనెటీగల దాడి 

డిప్యూటీ సీఎం నారాయణస్వామి 2.40 గంటలకు జలాశయం వద్దకు చేరుకున్నారు. కాసేపటికి ఒక్కసారిగా తేనెటీగలు వచ్చి అందరినీ చుట్టుముట్టాయి. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి డిప్యూటీ సీఎంను కారులో కూర్చోపెట్టడంతో ప్రమాదం తప్పింది. ధనంజయవర్మ, శేషాద్రి, గోపినాథ్‌, ధనశేఖర్‌వర్మ ప్రాథమిక ఆస్పత్రిలో చికిత్స చేయింకున్నారు.  అంతకుముందు  డిప్యూటీ సీఎం నారాయణస్వామి  కార్వేటినగరం గాండ్లమిట్ట కూడలి వద్ద మూడు రాజధానులు బిల్లు ఆమోదంతో ఆయన వైసీపీ నాయకులతో కలసి సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Updated Date - 2020-08-02T10:41:30+05:30 IST