గోదావరి జలాలు అందించేందుకు కృషి

ABN , First Publish Date - 2021-06-18T07:08:11+05:30 IST

బునాదిగాని (ధర్మారం) కాల్వను బస్వాపూర్‌ ప్రాజె క్టుకు అనుసంధానం చేయించి, మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు గోదావరి జలాలు అందించేందుకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. గురువారం మోత్కూరు, అడ్డగూడూరు మం డలాల్లో 66 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. 98 కిలోమీటర్ల పొడవు ఉన్న బునాదిగాని కాల్వలో కొంత భాగం అసంపూర్తిగా ఉందని, ఈ నిర్మాణాన్ని పూర్తి చేయించడంతో పాటు కాల్వ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి గోదావరి జలాలు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు.

గోదావరి జలాలు అందించేందుకు కృషి
మోత్కూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

మోత్కూరు, జూన్‌ 17: బునాదిగాని (ధర్మారం) కాల్వను బస్వాపూర్‌ ప్రాజె క్టుకు అనుసంధానం చేయించి, మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు గోదావరి జలాలు అందించేందుకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. గురువారం మోత్కూరు, అడ్డగూడూరు మం డలాల్లో 66 మందికి కల్యాణలక్ష్మి,  షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.  98 కిలోమీటర్ల పొడవు ఉన్న బునాదిగాని కాల్వలో కొంత భాగం అసంపూర్తిగా ఉందని, ఈ నిర్మాణాన్ని పూర్తి చేయించడంతో పాటు  కాల్వ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి గోదావరి జలాలు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమాల్లో మోత్కూరు, అడ్డగూ డూరు ఎంపీపీలు సంధ్యారాణి,  అంజయ్య, జడ్పీటీసీలు శారద,  జ్యోతి. మోత్కూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రి, సోంమల్లు,  మేఘరెడ్డి, పొన్నాల వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ త్రివేణి,  దైద పురుషోత్తంరెడ్డి, గుండిగ జోసెఫ్‌, ఆంథోని, తహసీల్దార్లు షేక్‌ అహమ్మద్‌, రామకృష్ణ, ఎంపీడీవోలు పి.మనోహర్‌రెడ్డి, చంద్రమౌళి పాల్గొన్నారు.

‘పిలాయిపల్లి కాల్వను వెంటనే పూర్తి చేయాలి’ 

భూదాన్‌పోచంపల్లి: పిలాయిపల్లి కాల్వ పనులు సత్వరమే పూర్తిచేసి  వానాకాలం పంటకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని  భూదాన్‌పోచంపల్లి ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి కోరారు.  గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి కత్వా వద్ద నిర్మాణంలో ఉన్న  పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులను వారు పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత.  వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌,  కందాడి భూపాల్‌రెడ్డి, పాటి సుధాకర్‌రెడ్డి, రంగ విశ్వనాథం,మాధవరెడ్డి, ఐతరాజు భిక్షపతి, దానయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T07:08:11+05:30 IST